Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 2:14 - తెలుగు సమకాలీన అనువాదము

14 అయినా, నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసివుంది: అవేమనగా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, జారత్వం చేసేలా ఇశ్రాయేలీయులను వేధించమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలోఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులను నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను ఖచ్చితంగా పాటించేవారు నీలో ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 “కాని కొన్ని విషయాల్లో నాకు నీవు నచ్చలేదు. బిలాము బోధలు పఠించేవాళ్ళు కొందరు నీ సంఘంలో ఉన్నారు. ఈ బిలాము, ఇశ్రాయేలీయులను రేకెత్తించి వాళ్ళతో పాపపు పనులు చేయించమని బాలాకుకు బోధించాడు. బాలాకు వాళ్ళు విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ఆహారం తినేటట్లు అవినీతిగా బ్రతికేటట్లు చేసాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అయినా, నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉంది: అవేమనగా విగ్రహాలకు అర్పించిన ఆహారం తినేలా, లైంగిక దుర్నీతి జరిగించేలా ఇశ్రాయేలీయులను వేధించమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అయినా, నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉంది: అవేమనగా విగ్రహాలకు అర్పించిన ఆహారం తినేలా, లైంగిక దుర్నీతి జరిగించేలా ఇశ్రాయేలీయులను వేధించమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 2:14
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా విషయంలో ప్రజలను ఆటంకపరిచే వాటిని బట్టి లోకానికి శ్రమ. అయితే అలాంటి శోధనలు తప్పవు కాని అవి ఎవరి వలన వస్తున్నాయో, వానికి శ్రమ.


విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది. మీకు క్షేమం కలుగును గాక.


అయితే యూదేతరుల విశ్వాసులు, ‘విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి’ అనే మా నిర్ణయాన్ని వారికి వ్రాసి తెలిపాం” అన్నారు.


మరియు దావీదు, “వారి భోజనపు బల్ల వారికి ఉచ్చుగా బోనుగా మారి వారికి అడ్డుబండగా మరియు తగిన శాస్తిగా ఉండును గాక.


కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మానేద్దాం. దానికి బదులు, సహోదరి లేదా సహోదరుని మార్గంలో ఆటంకంగా ఉండకుండా మీ మనస్సును సిద్ధపరచుకోండి.


మాంసం తినకపోవడం గాని మద్యం త్రాగకపోవడం గాని మీ సహోదరులు లేక సహోదరీలు పడిపోయేలా చేసే ఏదైనా చేయకపోవడమే మంచిది.


వారెందుకు చేరుకోలేకపోయారు? వారు నీతిని విశ్వాసమూలంగా కాకుండా క్రియలమూలంగా అన్నట్లు అనుసరించారు. ఆటంకంగా అడ్డురాయి ఎదురైనప్పుడు వారు తడబడ్డారు.


అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం: ఆయన యూదులకు ఆటంకంగా యూదేతరులకు వెర్రితనంగా ఉన్నారు.


అయితే లైంగిక దుర్నీతి జరుగుతుంది కనుక ప్రతి పురుషుడు తన సొంత భార్యతోనే, ప్రతి స్త్రీ తన సొంత భర్తతోనే లైంగిక సంబంధం కలిగి ఉండాలి.


వివాహం అందరిచేత గౌరవించబడాలి, వివాహ పాన్పు శుద్ధమైనదిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వ్యభిచారులను లైంగిక అనైతికత గల వారందరిని తీర్పు తీరుస్తాడు.


మరియు, “మనుష్యుల త్రోవకు అడ్డు వచ్చి తొట్రిల్లి పడిపోయేలా చేసేది ఈ రాయే.” వారిని పడద్రోసేది ఈ రాయే, ఆ వాక్యానికి అవిధేయులు అయినందుకు వారు పతనమయ్యారు. వారిని గురించిన దేవుని సంకల్పం అలాంటిది.


వారు సరియైన మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టత్వానికి వచ్చే జీతాన్ని ప్రేమించిన బెయేరు కుమారుడైన బిలాము మార్గాన్ని అనుసరించడానికి వెళ్ళారు.


వారికి శ్రమ! వారు కయీను త్రోవను అనుసరించారు; లాభం పొందాలని బిలాములా తప్పు మార్గాల్లో పరుగెత్తారు; కోరహులా తిరుగుబాటు చేయడంవలన నాశనం చేయబడ్డారు.


అయినా నేను నీ మీద తప్పు మోపవలసివున్నది: తాను ప్రవక్తిని అని చెప్పుకొనే యెజెబెలును మీరు సహిస్తున్నారు. లైంగిక దుర్నీతి, విగ్రహాలకు అర్పించిన ఆహారం తినాలని నా సేవకులకు బోధిస్తూ వారిని మోసం చేసింది.


అయినా నీకు ఉండిన మొదటి ప్రేమను నీవు వదిలేసావు అనే తప్పును నేను నీ మీద మోపవలసివుంది.


అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పాడు.


అయితే మాంత్రికులు, లైంగిక ఆశలకు లోనైన వారు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ