ప్రకటన 18:2 - తెలుగు సమకాలీన అనువాదము2 అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! ఆమె దయ్యాలకు నిలయంగా, ప్రతి దుష్ట ఆత్మ తిరిగే చోటుగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలకు నివాస స్థలంగా మారింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను–మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యము నైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 అతడు బిగ్గరగా యిలా అన్నాడు: “బాబిలోను మహానగరం కూలిపోయింది, కూలిపోయింది. అది అక్కడ దయ్యాలకు నివాసమైంది. ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది. ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి అది సంచరించు స్థలమైంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! అది దయ్యాలు సంచరించే స్థలంగా, ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! అది దయ్యాలు సంచరించే స్థలంగా, ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది. အခန်းကိုကြည့်ပါ။ |