Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 16:15 - తెలుగు సమకాలీన అనువాదము

15 అందుకే క్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి, “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి దుస్తులను ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15-16 హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతు రేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 “వినండి! నేను దొంగలా వస్తున్నాను. పదిమందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 “జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి వస్త్రం ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి వస్త్రం ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 16:15
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

“కాబట్టి మెలకువగా ఉండండి, ఎందుకంటే ఆ దినము కాని ఆ గంట కాని మీకు తెలియదు” అని చెప్పారు.


“మీరు శోధనలో పడకుండ ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు.


మీరు శోధనలో పడకుండ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం.” అని చెప్పారు.


కనుక జరగబోయే వాటన్నిటి నుండి తప్పించుకొని, మనుష్యకుమారుని ముందు నిర్దోషిగా నిలబడగలిగేలా అన్ని సమయాల్లో మెలకువగా ఉండి ప్రార్థించండి” అని చెప్పారు.


కనుక మీరు మెలకువగా ఉండండి! నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎలా కన్నీరు కార్చుతూ మీలో ప్రతి ఒక్కరిని మానకుండా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి.


ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడం.


అయితే సహోదరీ సహోదరులారా, ఆ దినం దొంగలా మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి మీరు చీకటిలో లేరు.


కనుక మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాం.


అన్నిటికి అంతం సమీపించింది, కనుక మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.


కాని ప్రభువు దినం దొంగలా వస్తుంది. ఆకాశాలు మహాశబ్దంతో గతించిపోతాయి; మూలకాలు అగ్ని చేత నశించిపోతాయి, భూమి దానిలో చేయబడివున్న సమస్తం లయమైపోతాయి.


“ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపు చుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!”


నేను త్వరగా వస్తున్నాను. కనుక ఎవరు నీ కిరీటాన్ని తీసుకోకుండా నీవు కలిగివున్న దాన్ని గట్టిగా పట్టుకో.


నీవు ధనవంతునివి అయ్యేలా అగ్నిలో పుటం వేసిన బంగారాన్ని, అవమానకరమైన నీ దిగంబరత్వం కనబడకుండా ధరించుకోవడానికి తెల్లని వస్త్రాన్ని, నీకు చూపు కలుగడానికి నీ కళ్ళకు మందును నా దగ్గర కొనుక్కో అని నేను నీకు సలహా ఇస్తున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ