Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 16:14 - తెలుగు సమకాలీన అనువాదము

14 అవి సూచక క్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను ప్రోగు చేయడానికి అవి వారి దగ్గరకు వెళ్ళాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 అవి భూతాత్మలు. వాటికి మహత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని “మహాదినం” నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరకి వెళ్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 16:14
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈ రాజ్యసువార్త సమస్త దేశ ప్రజలకు సాక్ష్యంగా లోకమంతట ప్రకటింపబడిన తర్వాత, అంతం వస్తుంది.


ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఎన్నుకొన్న వారిని సహితం మోసం చేయడానికి సూచక క్రియలను, అద్బుతాలను చేస్తారు.


ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఎన్నుకొన్న వారిని సహితం మోసం చేయడానికి సూచక క్రియలను, అద్బుతాలను చేస్తారు.


ఆ దినాల్లో రోమా రాజ్యమంతటా ప్రజా సంఖ్యను నిర్వహించాలని కైసరు ఆగస్టస్ ఆజ్ఞ జారీ చేశాడు.


మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కనుక మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కనుక వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు, వాడు తన స్వభాషలో మాట్లాడతాడు, ఎందుకంటే వాడు అబద్ధికుడు మరియు అబద్ధాలకు తండ్రి.


మొదటిగా, మీ అందరి కొరకు యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే మీ విశ్వాసం గురించి లోకమంతా చాటించబడుతూ ఉంది.


సాతాను చేసే పనులకు అనుకూలంగా దుర్మార్గుని రాకడ ఉంటుంది. అతడు తన అబద్ధాన్ని నిరూపించుకోవడానికి, తన శక్తిని చూపించుకోడానికి సూచక క్రియలు, అద్బుతాలు, మహాత్కార్యాలను చేస్తాడు,


చివరి దినాలలో కొందరు విశ్వాసాన్ని విడిచిపెట్టి మోసపరచే ఆత్మలను, దయ్యాలచే బోధించబడే వాటిని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా తెలియజేస్తున్నాడు.


అలాంటి జ్ఞానం పరలోక నుండి దిగివచ్చినది కాదు, అది ఈ లోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది కాదు, దయ్యాలకు సంబంధించిన జ్ఞానం.


మనం దేవుని పిల్లలమని, లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉన్నదని మనకు తెలుసు.


ఆ తరువాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేక అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు.


ఆ మృగం యొక్క ఒక తలకు చనిపోవునంతగా గాయం తగిలినట్లు ఉన్నది కానీ ఆ గాయం పూర్తిగా మానిపోయింది. అందుకు భూలోక ప్రజలంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని వెంబడించారు.


ఆ అపవిత్రాత్మలు రాజులనందరిని హెబ్రీ భాషలో “హర్మగిద్దోను” అని పిలువబడే స్థలంలో పోగుచేశాయి.


అప్పుడు బలిపీఠం ఈ విధంగా బదులిచ్చింది, “అవును, ఓ సర్వశక్తిమంతుడా ప్రభువైన దేవా, నీ తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి.”


ఈ రాజులందరు మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కనుక ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతోపాటు ఆయనచే పిలువబడిన వారు, ఎన్నుకోబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు.


ఆ సాతాను వాని ప్రజలను గోగు, మాగోగులో భూమి నలుదిక్కుల ఉన్న దేశాలను గోగు మాగోగు అనే వారిని మోసపుచ్చి యుధ్ధానికి సమకూర్చడానికి బయలుదేరి వెళ్తాడు. వారి సంఖ్య సముద్రపు ఇసుకరేణువుల్లా లెక్కకు మించి ఉంది.


నేను నీకు ఆజ్ఞాపించినట్లే నీవు సహనంతో సహించావు కనుక భూనివాసులు అందరిని పరీక్షించడానికి లోకం మీద రానున్న ఆ శోధన సమయం నుండి నేను నిన్ను కాపాడతాను.


ఎందుకంటే వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది, దాన్ని ఎవరు తట్టుకోగలరు?” అని వేడుకొంటున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ