Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 13:5 - తెలుగు సమకాలీన అనువాదము

5 ఆ మృగానికి దేవునికి విరుద్ధంగా తన గొప్పలు పలికి దైవదూషణ చేసే నోరు మరియు నలభై రెండు నెలల సమయం వరకు రాజ్యాలను ఏలడానికి అనుమతి ఇవ్వబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పా టాయెను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 బడాయి మాటలూ దైవ దూషణలూ చేసే నోరూ వాడికి ఉంది. నలభై రెండు నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 గర్వంగా మాట్లాడటానికి, దైవదూషణ చేయటానికి, తన అధికారాన్ని నలుబది రెండు నెలలు చెలాయించడానికి ఆ మృగానికి నోరు యివ్వబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఆ మృగానికి దేవునికి విరుద్ధంగా తన గొప్పలు చెప్తూ దైవదూషణ చేసే నోరు ఉంది. నలభై రెండు నెలల వరకు అధికారం చెలాయించడానికి అనుమతి ఇవ్వబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఆ మృగానికి దేవునికి విరుద్ధంగా తన గొప్పలు చెప్తూ దైవదూషణ చేసే నోరు ఉంది. నలభై రెండు నెలల వరకు అధికారం చెలాయించడానికి అనుమతి ఇవ్వబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 13:5
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

మిమ్మల్ని ఎవరైనా ఏ రీతిగానైనా మోసపరచనివ్వకండి. ఎందుకంటే తిరుగుబాటు వచ్చేవరకు, నాశనానికి కర్తయైన దుర్మార్గుడు బయటపడే వరకు ఆ దినము రాదు.


వాడు దేవునిగా పిలువబడే ప్రతిదానిని, పూజించబడే వాటన్నిటిని వ్యతిరేకించి, తనను తాను వాటన్నిటికంటే పైగా హెచ్చించుకొంటూ, తనంతట తానే దేవాలయంలో కూర్చొని, తానే దేవుడనని ప్రకటించుకుంటాడు.


ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు.


ఆ ఇద్దరు సాక్షులు సాక్ష్యం ఇవ్వడం పూర్తి చేసిన తరువాత, అగాధం నుండి ఒక మృగం వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించి చంపుతుంది.


ఒక కాలం కాలాలు సగకాలం వరకు సర్పానికి అందకుండా ఉండి తన ఆకలిదప్పులు తీర్చుకొనేలా అరణ్యంలో ఆమె కొరకు సిద్ధపరచిన స్థలానికి ఎగిరి వెళ్ళగలగడానికి ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి.


ఆ స్త్రీ 1,260 రోజుల వరకు సంరక్షింపబడేలా దేవుడు ఆమె కొరకు ఏర్పాటు చేసిన స్థలమున్న అరణ్యంలోనికి ఆమె పారిపోయింది.


దేవుని ప్రజల మీద యుద్ధం చేసి వారిని జయించడానికి ఆ మృగానికి అనుమతి ఇవ్వబడింది. ప్రతి గోత్రాన్ని, ప్రజలను, ప్రతి భాష మాట్లాడేవారిని, ప్రతి దేశాన్ని ఏలడానికి దానికి అధికారం ఇవ్వబడింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ