Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 13:17 - తెలుగు సమకాలీన అనువాదము

17 ఎందుకంటే ఈ ముద్రను వేసుకొనేవారు తప్ప మరి ఎవరూ అమ్ముకోలేరు కొనుక్కోలేరు. ఈ ముద్ర మృగం పేరు లేక ఆ మృగం పేరుకు గల సంఖ్యకు నిదర్శనంగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు, లేక దాని పేరుతో సంఖ్య వ్రాయబడి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 ఎందుకంటే ఈ ముద్రను వేసుకునేవారు తప్ప మరి ఎవరూ అమ్ముకోలేరు కొనుక్కోలేరు. ఈ ముద్ర మృగం పేరుకు ఆ మృగం పేరుకు గల సంఖ్యకు నిదర్శనంగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 ఎందుకంటే ఈ ముద్రను వేసుకునేవారు తప్ప మరి ఎవరూ అమ్ముకోలేరు కొనుక్కోలేరు. ఈ ముద్ర మృగం పేరుకు ఆ మృగం పేరుకు గల సంఖ్యకు నిదర్శనంగా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 13:17
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను నా శరీరంపై యేసు యొక్క గుర్తులను కలిగివున్నాను, కనుక ఇక నుండి ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు.


ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా అందరూ వారి కుడి చేతి మీద లేక నుదుటి మీద ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది.


ఈ మృగం సంఖ్య తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం, పరిజ్ఞానం గలవాడు ఆ మృగపు సంఖ్యను లెక్కించి తెలుసుకొనును గాక! అది ఒక మానవుని సంఖ్య. ఆ సంఖ్య 666.


ఆ మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించిన లేక దాని పేరు ముద్రను వేయించుకొన్నవారు విశ్రాంతి లేకుండా రాత్రింబగళ్లు వేదన పొందుతారు. ఆ వేదన పొగ ఎల్లప్పుడు లేస్తూనే ఉంటుంది” అని బిగ్గరగా చెప్పాడు.


మూడవ దేవదూత వారిని వెంబడించి పెద్ద స్వరంతో, “మృగం దాని విగ్రహాన్ని పూజించి, తమ నుదుటి మీద లేక చేతి మీద దాని ముద్ర వేయించుకొంటే,


నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూసాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, ఆ మృగం యొక్క విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను ఎదిరిస్తూ జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకొని ఉన్నారు.


ఆమె నుదిటి మీద వ్రాసి ఉన్న పేరు ఒక మర్మం, “మహా బబులోను పట్టణం, వేశ్యలకు తల్లి భూమి మీద జరిగే ప్రతి అసహ్యమైన కార్యానికి తల్లి,” అని వ్రాయబడి ఉంది.


అప్పడు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడినవారు కూర్చునివున్న సింహాసనాలను నేను చూసాను. యేసును గురించి సాక్ష్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి తలలు నరికివేయబడి హతులైన వారి ఆత్మలను నేను చూసాను. వారు ఆ మృగాన్ని కాని వాని విగ్రహాన్ని కాని పూజించలేదు, వారు దాని ముద్రను తమ నుదుటి మీద కాని చేతి మీద కాని వేయించుకోలేదు. వారు బ్రతికివచ్చి క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు.


వారు ఆయన ముఖాన్ని చూస్తారు, వారి నుదుటి మీద ఆయన పేరు ఉంటుంది.


జయించినవారిని నా దేవాలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. అప్పుడు వారు దానిలో నుండి ఎన్నడూ తొలగిపోలేరు. వారి మీద నేను నా దేవుని పేరును పరలోకంలో ఉన్న నా దేవుని నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అనే నా దేవుని పట్టణం పేరును వ్రాస్తాను, వాని మీద నేను నా క్రొత్త పేరును కూడా వ్రాస్తాను.


“మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు” అని చెప్పడం నేను విన్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ