Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 13:16 - తెలుగు సమకాలీన అనువాదము

16 ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా అందరూ వారి కుడి చేతి మీద లేక నుదుటి మీద ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16-17 కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరి ద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారములేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ వాడు బలవంతం చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్బంధం చేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా సరే అందరు తమ కుడిచేతి మీద గాని నుదుటి మీద గాని ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా సరే అందరు తమ కుడిచేతి మీద గాని నుదుటి మీద గాని ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 13:16
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే ఈ రోజు వరకు దేవుడు నాకు సహాయం చేశాడు కనుకనే క్రీస్తు శ్రమపడి, చనిపోయినవారిలో నుండి మొదటి వానిగా లేస్తాడనేది,


అలాగే, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, యూదులు కాని వారైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమందరం ఒకే శరీరంగా ఉండడానికి ఒకే ఆత్మలో బాప్తిస్మం పొందాం, మనందరికి త్రాగడానికి ఒకే ఆత్మ ఇవ్వబడ్డాడు.


ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే.


నేను నా శరీరంపై యేసు యొక్క గుర్తులను కలిగివున్నాను, కనుక ఇక నుండి ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు.


ఎందుకంటే, దాసులైనా, స్వతంత్రులైనా మీలో ప్రతివారు ఏ మంచి కార్యాన్ని చేస్తారో దాని ఫలాన్ని ప్రభువు నుండి పొందుతారని మీకు తెలుసు.


ఇక్కడ యూదేతరులను గాని లేక యూదులని గానీ, సున్నతి పొందిన వారని గానీ సున్నతి పొందని వారని గానీ, అనాగరికులని లేక నాగరికులని కాని, బానిసలని గాని స్వతంత్రులని కాని భేదం లేదు. క్రీస్తే సమస్తం, అందరిలో ఉన్నది ఆయనే.


యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లే ఈ బోధకులు కూడా సత్యాన్ని ఎదిరిస్తున్నారు. వారికున్న దుష్టహృదయాన్ని బట్టి విశ్వాస విషయంలో తృణీకరించబడ్డారు.


దేశాలు కోపగించినందుకు నీ ఉగ్రత వచ్చింది. ఇక చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికి, సేవకులైన ప్రవక్తలకు, నీ నామాన్ని గౌరవించే నీ ప్రజలకు అల్పులైనా ఘనులైనా నీ ప్రజలకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి, భూమిని నాశనం చేసేవారిని నాశనం చేయడానికి సమయం వచ్చింది.”


నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూసాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, ఆ మృగం యొక్క విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను ఎదిరిస్తూ జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకొని ఉన్నారు.


రాజుల మాంసాన్ని, సైన్యాధికారుల మాంసాన్ని, బలవంతుల మాంసాన్ని, గుర్రాల, వాటి మీద సవారీ చేసేవారి మాంసాన్ని, స్వతంత్రులు కాని బానిసలు కాని ఘనులు కాని అల్పులు కాని ప్రజలందరి మాంసాన్ని తినడానికి రండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.


అయితే ఆ మృగం పట్టుబడింది, దాంతో పాటు దాని పక్షాన సూచక క్రియలు చేసిన అబద్ధ ప్రవక్త కూడా పట్టుబడ్డాడు. అతడు ఈ సూచక క్రియలతో మృగం యొక్క ముద్ర వేయబడి దాని విగ్రహాన్ని పూజించిన వారిని మోసగించాడు. వీరిద్దరు ప్రాణాలతో మండుతున్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడ్డారు.


అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం ఇలా పలికింది, “దేవుని భయపడేవారలారా, ఓ దేవుని సేవకులరా! చిన్నవారైన పెద్దవారైన అందరూ మన దేవుని స్తుతించండి.”


ఆ తరువాత దేవుని సింహాసనం ముందు ఘనులైనా అల్పులైనా చనిపోయిన వారందరూ నిలబడి ఉండడం నేను చూసాను. గ్రంథాలు తెరవబడ్డాయి. వాటిలో జీవగ్రంథం అనబడే మరొక గ్రంథం తెరవబడింది. ఆ గ్రంథంలలో వ్రాయబడిన ప్రకారం చనిపోయినవారు తాము చేసిన పనులను బట్టి తీర్పు తీర్చబడ్డారు.


అప్పడు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడినవారు కూర్చునివున్న సింహాసనాలను నేను చూసాను. యేసును గురించి సాక్ష్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి తలలు నరికివేయబడి హతులైన వారి ఆత్మలను నేను చూసాను. వారు ఆ మృగాన్ని కాని వాని విగ్రహాన్ని కాని పూజించలేదు, వారు దాని ముద్రను తమ నుదుటి మీద కాని చేతి మీద కాని వేయించుకోలేదు. వారు బ్రతికివచ్చి క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు.


భూ రాజులు, రాకుమారులు, ప్రధానులు, ధనవంతులు, బలవంతులు, దాసులు, స్వతంత్రులు ప్రతి ఒక్కరు గుహలలో, కొండల రాళ్ళ సందులలో దాక్కున్నారు.


“మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు” అని చెప్పడం నేను విన్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ