Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 12:10 - తెలుగు సమకాలీన అనువాదము

10 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, “ఇదిగో, ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యం మన దేవునివి అయ్యాయి ఆయన అభిషిక్తుని అధికారం వచ్చింది. ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని–రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపు వాడైన అపవాది1 పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, “ఇదిగో, రక్షణ, అధికారం, రాజ్యం మన దేవునివి అయ్యాయి. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, “ఇదిగో, రక్షణ, అధికారం, రాజ్యం మన దేవునివి అయ్యాయి. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 12:10
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు యేసు, “నీవే చెప్పినట్లే, అయితే, ఇక నుండి మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడి వైపున కూర్చొని ఉండడం మరియు ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారని మీ అందరికి చెప్తున్నాను.”


యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది.


మీ రాజ్యం వచ్చును గాక; పరలోకంలో జరుగునట్లు భూమి మీద, మీ చిత్తం జరుగును గాక.


ఆయన వారితో, “మీరు ప్రార్థన చేసేప్పుడు: “ ‘తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక.


“సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు.


ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభువైన యేసు శక్తి ద్వారా నేను ఆత్మలో మీ సమక్షంలో మీతో ఉన్నాను.


అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండడానికి ముఖ్యంగా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.


అదే విధంగా, వృద్ధ స్త్రీలకు, భక్తి జీవితాన్ని కలిగివుండి, అపవాదులు వేసేవారిగా లేదా మద్యానికి బానిసలుగా ఉండకుండా, ఏది మంచిదో దానిని బోధించేవారిగా ఉండుమని బోధించు.


మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.


ఏడవ దేవదూత తన బూరను ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు, ఇలా చెప్పడం వినిపించింది, “భూలోక రాజ్యం ప్రభు రాజ్యంగా ఆయన క్రీస్తు రాజ్యంగా మారాయి కనుక ఆయన ఎల్లకాలం పరిపాలిస్తాడని.”


చివరి వరకు నా చిత్తం చేస్తూ జయించే వారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద అధికారం ఇస్తాను.


వారు తమ స్వరాలను ఎత్తి: “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, మరియు వధింపబడిన గొర్రెపిల్లకే, రక్షణ చెందుతుంది” అని బిగ్గరగా అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ