Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఫిలిప్పీయులకు 2:2 - తెలుగు సమకాలీన అనువాదము

2 మీరు ఏక మనస్సు, ఒకే ప్రేమ కలిగి, ఆత్మలో ఒక్కటిగా ఉంటూ ఒకే భావం కలవారిగా ఉండి, నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుం చుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 మీరు ఏక మనస్సు, ఒకే ప్రేమ కలిగి, ఆత్మలో ఒక్కటిగా ఉంటూ ఒకే భావం కలవారిగా ఉండి, నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 మీరు ఏక మనస్సు, ఒకే ప్రేమ కలిగి, ఆత్మలో ఒక్కటిగా ఉంటూ ఒకే భావం కలవారిగా ఉండి, నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఫిలిప్పీయులకు 2:2
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

పెండ్లికుమార్తె పెండ్లికుమారునికే చెందుతుంది. పెండ్లికుమారుని దగ్గర ఉండి చూసుకొనే స్నేహితుడు అతడు ఏమైనా చెబితే వినాలని ఎదురుచూస్తాడు, పెండ్లికుమారుని స్వరాన్ని విన్నప్పుడు అతడు ఎంతో సంతోషిస్తాడు. నా సంతోషం కూడా అలాంటిదే, ఇప్పుడు అది సంపూర్ణమయ్యింది.


వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, ఆయన తమ్ముళ్ళు కలిసి, ఏక మనస్సుతో విడువక ప్రార్థిస్తున్నారు.


పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు, వారందరు ఒక్కచోట చేరుకొన్నారు.


వారందరు ప్రతి రోజు దేవాలయ ఆవరణంలో క్రమంగా కలుసుకొనేవారు. తమ ఇండ్లలో అందరు కలిసి ఆనందంగా యదార్థమైన హృదయంతో రొట్టెను విరిచి తినేవారు.


అపొస్తలులు ప్రజల మధ్యలో అనేక సూచక క్రియలను, అద్బుతాలను చేశారు. విశ్వసించిన వారందరు సొలొమోను మండపంలో కలుసుకొనేవారు.


ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం కలిగి ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం కలిగి ఉండవద్దు.


సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ యదార్థమైన ఏక మనస్సుతో, ఒకే ఆలోచనతో ఒకే భావంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను.


చివరిగా, సహోదరీ సహోదరులారా, సంతోషించండి! సంపూర్ణంగా పునరుద్ధరించబడడానికి పోరాడండి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఏక మనస్సు కలిగివుండండి, సమాధానం కలిగి జీవించండి, ప్రేమ సమాధానాలకు కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండును గాక.


కాబట్టి, నేను అక్కడికి వచ్చినపుడు నన్ను సంతోషపెట్టాల్సిన వ్యక్తులే నన్ను దుఃఖపెట్టకూడదని నేను మీకు వ్రాసాను. నా ఆనందమే మీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకం.


అతని రాక వల్లనే కాదు కాని, మీరు అతనికిచ్చిన ఆదరణ వల్ల కూడా. నన్ను చూడాలనే మీ కోరిక గురించి, మీ లోతైన దుఃఖం గురించి, నా పట్ల మీకున్న అభిమానం గురించి అతడు మాకు చెప్పాడు. అందుకు నేను ఎంతో ఎక్కువగా ఆనందించాను.


మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను.


అతనిలా మీ క్షేమం గురించి నిజమైన ఆసక్తి కలిగినవారు నా దగ్గర ఎవరు లేరు.


ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండుమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను.


నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నా కాని, ఆత్మలో మీతో కూడా ఉండి, మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నారో క్రీస్తులో మీ విశ్వాసం ఎంత స్థిరంగా ఉందో చూసి ఆనందిస్తున్నాను.


ప్రభువు ప్రేమించిన సహోదరీ సహోదరులారా, మేము మీ కొరకు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీరు రక్షణ పొందడానికి సత్యాన్ని నమ్మడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మ చేత పరిశుద్ధపరచడానికి ప్రారంభం నుండి ఏర్పరచుకొన్నారు.


నీ కన్నీరు జ్ఞాపకం చేసుకొని, నేను ఆనందంతో నింపబడేలా నిన్ను చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాను.


అవును సహోదరుడా, ప్రభువులో నీ నుండి నేను కొంత లాభం పొందాలని ఆశిస్తున్నాను; క్రీస్తులో నా హృదయాన్ని ఉత్తేజపరచు.


తండ్రి మనకు ఆజ్ఞాపించిన విధంగా, నీ బిడ్డలలో కొందరు సత్యంలో జీవించడం చూసి ఎంతో సంతోషించాను.


నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ