Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఫిలిప్పీయులకు 2:15 - తెలుగు సమకాలీన అనువాదము

15-16 తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకొని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లాగా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై, నీతి లేకుండా జీవిస్తున్న వీళ్ళ మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డల్లా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15-16 తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15-16 తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఫిలిప్పీయులకు 2:15
42 ပူးပေါင်းရင်းမြစ်များ  

“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కనుక పాముల్లాగ వివేకంగా, పావురాల్లాగా కపటం లేనివారిగా ఉండండి.


అందుకు యేసు, “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకొనిరండి” అన్నారు.


మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై యున్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.


వారిద్దరు ప్రభువు ఆజ్ఞలను, శాసనాలను నిందారహితంగా అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు.


మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేని వారికి మరియు దుష్టులకు దయ చూపించేవాడు.


యోహాను మండుచూ వెలుగిచ్చే ఒక దీపం వంటివాడు, మీరు అతని వెలుగులో కొంత కాలం ఆనందించడానికి ఇష్టపడ్డారు.


ఇంకా అనేక రకాల మాటలతో పేతురు వారిని హెచ్చరించి, “ఈ వక్ర తరం నుండి మీరు రక్షణ పొందండి” అని వారికి విజ్ఞప్తి చేశాడు.


శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవడానికి సత్యాన్ని మళ్ళించే వారు మీ సొంతవారిలో నుండే బయలుదేరుతారు.


మీ విధేయత గురించి ప్రతి ఒక్కరు విన్నారు కనుక మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషులుగా ఉండాలని నేను కోరుతున్నాను.


ఆ దేవుడే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడే రోజున, మీరు నిరపరాధులుగా ఉండాలని అంతం వరకు మిమ్మల్ని స్థిరపరుస్తారు.


కనుక, “వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్రమైన వాటిని ముట్టకండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.


దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేదీ లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కొరకు తనను తాను సమర్పించుకున్నారు.


అత్యాసక్తితో సంఘాన్ని హింసించాను; ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని నీతి విషయంలో నిరపరాధిని.


సమాధానకర్త అయిన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక.


వారు ఖచ్చితంగా మొదట పరీక్షించబడాలి; ఏ దోషం లేనివారిగా నిరూపించబడితేనే వారు సంఘపరిచారకులుగా సేవ చేయవచ్చు.


సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్ధ్యం కలవానిగా ఉండాలి.


కాబట్టి యవ్వన విధవరాండ్రకు నేను చెప్పేది ఏంటంటే, వారు వివాహం చేసుకొని పిల్లలను కని, తమ గృహాలను శ్రద్ధగా చూసుకొంటూ, తమను నిందించడానికి విరోధికి అవకాశమివ్వకుండా చూసుకోవాలి.


అయితే సంఘపెద్దలు ఎవరైనా పాపం చేస్తే, ఇతరులకు హెచ్చరికగా ఉండడానికి వారిని అందరి ముందు గద్దించు.


ఎవరు కూడా నిందించబడకుండా ఉండడానికి ప్రజలకు ఈ సూచనలన్నింటిని చెప్పు.


ఒక సంఘపెద్ద నిందారహితునిగా, తన భార్యకు నమ్మకమైనవానిగా ఉండాలి, అతని పిల్లలు విశ్వాసం గలవారిగా ఉండి, దుష్టమైన పనులు చేశారని అవిధేయులు అనే నిందలేనివారిగా ఉండాలి.


యజమానుల నుండి ఏదీ దొంగతనం చేయకుండా, తాము నమ్మదగిన వారని నిరూపించుకోవాలని దాసులకు బోధించు, అప్పుడు వారు ప్రతి విషయంలో మన రక్షకుడైన దేవుని బోధను ఆకర్షణీయంగా చేస్తారు.


కనుక ఈ విషయాలను నీవు వారికి బోధించాలి, నీకు ఇవ్వబడిన పూర్తి అధికారంతో వారిని హెచ్చరించి గద్దించు. నిన్ను ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా చూసుకో.


పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చించబడినవాడై వుండి మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు.


యూదులు కాని మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.


కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఎన్నుకోబడిన ప్రజలు, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని ప్రత్యేకమైన సొత్తైయున్నారు.


కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు దీని కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు కనుక కళంకం లేనివారిగా నిందలేనివారిగా ఆయనలో శాంతం గలవారిగా ఉండడానికి ప్రయత్నించండి.


నీవు ఎంతగా పడిపోయావో గుర్తించు! నీవు పశ్చాత్తాపపడి మొదట చేసిన పనులు చేయి. నీవు పశ్చాత్తాపపడకపోతే నేను నీ దగ్గరకు వచ్చి, నీ దీపస్తంభాన్ని దాని స్థానంలో నుండి తీసివేస్తాను.


యూదులు కాకపోయినా తాము యూదులం అని అబద్ధాలు చెప్పుకొనే సాతాను సమాజానికి చెందిన వారందరిని నీ దగ్గరకు రప్పించి నీ పాదాల ముందు సాగిలపడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వారు ఒప్పుకొనేలా చేస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ