Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఫిలేమోనుకు 1:22 - తెలుగు సమకాలీన అనువాదము

22 మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కనుక నా కొరకు ఒక వసతిగదిని ఏర్పాటుచేయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 అంతేకాదు, నీ ప్రార్థ నల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధముచేయుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 సరే. నా కోసం వసతి సిద్ధం చెయ్యి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను మీ దగ్గరికి పంపుతాడనే ఆశాభావంతో ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 మరొక విషయం. అతిథుల కోసం ఉంచిన గదిని నా కోసం సిద్ధంగా ఉంచు. నీ ప్రార్థలను విని దేవుడు నన్ను నీ దగ్గరకు పంపుతాడని ఆశిస్తున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కాబట్టి నా కోసం ఒక వసతిగదిని ఏర్పాటు చేయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కాబట్టి నా కోసం ఒక వసతిగదిని ఏర్పాటు చేయండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఫిలేమోనుకు 1:22
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

‘పౌలు భయపడకు. నీవు కైసరు ముందు విచారణకు నిలబడవలసి ఉంది. నీతో కూడ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరి జీవితాలను దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు.


ఒక రోజును ఏర్పాటు చేసుకొని, పౌలు ఉన్న చోటికి చాలామంది వచ్చారు. అతడు ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యం గురించి వివరిస్తూ సాక్ష్యమిచ్చి, మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తలు వ్రాసిన పుస్తకాల నుండి యేసు గురించి బోధిస్తూ వారిని ఒప్పించడానికి ప్రయత్నించాడు.


కనుక నేను స్పెయినుకు వెళ్ళేటప్పుడు అక్కడికి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని చూడాలని కొంత కాలం మీ సహవాసంలో ఆనందించిన తరువాత అక్కడి నుండి నా ప్రయాణంలో మీరు నాకు సహాయపడాలని ఆశిస్తున్నాను.


మీ ప్రార్థనల ద్వారా మాకు సహాయం చేస్తున్నారు, గనుక వాటిలో అనేక ప్రార్థనలకు జవాబుగా దేవుడు మాకు కనికరం చూపినందుకు మా పక్షంగా అనేకులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.


ఎందుకంటే, మీ ప్రార్థన వలన, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుట వలన, నాకు ఏమి జరిగినా అది నాకు రక్షణగానే మారుతుందని నాకు తెలుసు.


నేనూ త్వరలోనే వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది.


త్వరలో నేను మిమ్మల్ని కలుసుకొనేలా నా కొరకు ప్రార్థించమని మిమ్మల్ని ప్రత్యేకంగా బ్రతిమాలుతున్నాను.


మన సహోదరుడైన తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యాడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అతడు త్వరగా వస్తే, నేను మిమ్మల్ని చూడడానికి అతనితో కలిసి వస్తాను.


కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు బాగుపడునట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది, ఫలవంతమైనది.


మీకు చాలా సంగతులు వ్రాయవలసి ఉంది, కాని సిరాతో కాగితంతో వ్రాయడం ఇష్టం లేదు. మన సంతోషం సంపూర్ణం కావడానికి, నేను మీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.


త్వరలో నేను నీ దగ్గరకు వచ్చి, ముఖాముఖిగా నీతో మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ