Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మత్తయి 27:2 - తెలుగు సమకాలీన అనువాదము

2 కనుక వారు ఆయనను బంధించి, తీసుకువెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఆయనను బంధించి, తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 వాళ్ళాయన్ని బంధించి తీసుకెళ్ళి రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 కాబట్టి వారు ఆయనను బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 కాబట్టి వారు ఆయనను బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మత్తయి 27:2
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదేతరుల చేత అపహసించబడి, కొరడాలతో కొట్టబడి, సిలువ వేయబడడానికి అప్పగిస్తారు. అయితే ఆయన మూడవ రోజున సజీవంగా మరల తిరిగి లేస్తాడు!” అని చెప్పారు.


ఒకవేళ ఇది అధిపతికి తెలిసినా, మేము అతనికి చెప్పి మీకు ఏ ప్రమాదం కలుగకుండా చూస్తాము” అని వారికి మాట ఇచ్చారు.


అక్కడ ఉండిన ప్రజలలో కొందరు యేసుతో, పిలాతు గలిలయుల రక్తాన్ని బలులతో కలిపిన సంగతిని చెప్పారు.


ఆయనపై నిఘా వేసి ఉంచడానికి, వారు యదార్థంగా ఉన్నట్టు నటించగల వేగులవారిని పంపారు. యేసు మాట్లాడే దాంట్లో ఏదో తప్పు పట్టి ఆయనను పట్టుకొని, ఆయనను అధిపతి యొక్క అధికారానికి, ప్రభావానికి అప్పగించవచ్చని వారు ఆశించారు.


ఆ సభ వారందరు లేచి యేసును పిలాతు దగ్గరకు తీసుకువెళ్లారు.


అంతకు ముందు శత్రువులుగా ఉండిన హేరోదు మరియు పిలాతు ఆ రోజున స్నేహితులు అయ్యారు.


తిబెరి కైసరు ఏలుచున్న పదిహేనవ సంవత్సరంలో, యూదయ ప్రాంతానికి అధిపతిగా పొంతి పిలాతు, గలిలయ ప్రాంతానికి చతుర్థాధిపతిగా హేరోదు, ఇతూరియా మరియు త్రకోనీతి అనే ప్రాంతాలకు చతుర్థాధిపతిగా అతని తమ్ముడైన ఫిలిప్పు మరియు అబిలేనె ప్రాంతానికి చతుర్థాధిపతిగా లుసానీయ ఉన్నారు.


అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతి, యూదా నాయకులు యేసును బంధించారు.


అప్పుడు అన్నా యేసును కట్లతో బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించాడు.


అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప వద్దనుంచి రోమా అధిపతి భవనానికి తీసుకువెళ్ళారు, అప్పటికి తెల్లవారింది కనుక అపవిత్రపడకుండా పస్కాను తినాలని వారు భవనంలోనికి వెళ్లలేదు.


హేరోదు అతన్ని విచారణకు తీసుకొనిరావడానికి ముందు రాత్రి, పేతురు రెండు గొలుసులతో బంధించబడి, ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. అలాగే కాపలావారు చెరసాల తలుపు ముందు కాపలా కాస్తున్నారు.


అధిపతి వచ్చి అతన్ని పట్టుకొని, రెండు గొలుసులతో బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత “అతడు ఎవరు? ఏమి చేశాడు?” అని అడిగాడు.


వారు అతన్ని కొరడాలతో కొట్టడానికి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు, అక్కడ నిలబడి ఉన్న శతాధిపతితో పౌలు, “ఏ నేరం నిరూపించకుండానే ఒక రోమీయుని కొరడాలతో కొట్టించడం మీకు న్యాయమేనా?” అన్నాడు.


అతన్ని విచారణ చేయబోయేవారు వెంటనే అతన్ని విడిచిపెట్టారు. గొలుసులతో బంధించిన పౌలు రోమీయుడని తెలుసుకొన్న తర్వాత అధిపతి కూడా భయపడ్డాడు.


రెండు సంవత్సరాల తర్వాత, ఫెలిక్స్ స్థానంలో పోర్కియస్ ఫేస్తు అధిపతిగా నియమించబడ్డాడు. అయితే ఫెలిక్స్ యూదులకు ఉపకారం చేయాలని పౌలును చెరసాలలోనే ఉంచాడు.


ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మీతో మాట్లాడాలని మిమ్మల్ని పిలిపించాను. ఇశ్రాయేలీయుల యొక్క నిరీక్షణను బట్టి నేను ఈ గొలుసుతో బంధించబడి ఉన్నాను” అని వారితో చెప్పాడు.


మన పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచారు. మీరు ఆయనను చంపబడటానికి అప్పగించారు, పిలాతు ఆయనను విడుదల చేయాలని నిర్ణయించుకొన్నప్పటికి, మీరు అతని ముందు క్రీస్తును తిరస్కరించారు.


నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా, యూదులు కాని జనులతో మరియు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి హేరోదు మరియు పొంతి పిలాతు ఈ పట్టణంలో కుట్ర చేశారు.


ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఎవరైనా తనకు కనబడితే, పురుషులనైనా స్త్రీలనైనా బంధీలుగా యెరూషలేముకు తీసుకొనిరావడానికి, దమస్కులోని సమాజమందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇవ్వుమని అడిగాడు.


అన్నిటికి జీవాన్ని ఇచ్చే దేవుని యెదుట, పొంతి పిలాతు యెదుట మంచి సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ముందు నేను నీకు నిర్ధేశించాను.


దీనిని బట్టే నేను నేరస్థునిలా బంధించబడ్డాను. కాని దేవుని వాక్యం బంధించబడలేదు.


చెరసాలలో ఉన్న వారిని మీరు కూడా వారితో పాటు చెరసాలలో ఉన్నట్లుగా, బాధలుపడుతున్న వారితో మీరు కూడా ఆ బాధల్లో వారితో ఉన్నట్లుగా వారిని జ్ఞాపకం చేసుకోండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ