Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లూకా సువార్త 6:23 - తెలుగు సమకాలీన అనువాదము

23 “ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది. ఎందుకంటే వారి పితరులు కూడా ప్రవక్తలను ఇలాగే హింసించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి. చూడండి, పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదే విధంగా ప్రవర్తించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 “ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది. ఎందుకంటే వారి పితరులు కూడా ప్రవక్తలను ఇలాగే హింసించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 “ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది. ఎందుకంటే వారి పితరులు కూడా ప్రవక్తలను ఇలాగే హింసించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లూకా సువార్త 6:23
45 ပူးပေါင်းရင်းမြစ်များ  

సంతోషించి ఆనందించండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు.


ఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, మరియు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది.


నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేసాడు.


మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేని వారికి మరియు దుష్టులకు దయ చూపించేవాడు.


అతనితో, “లేచి నీ కాళ్ళ మీద నిలబడు!” అని బిగ్గరగా అనగానే అతడు గంతులువేసి నడవసాగాడు.


వాడు లేచి ఎగిరి తన కాళ్ళపై నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాడు నడుస్తూ, గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు.


ఆ నామంను బట్టి అవమానం పొందడానికి తగినవారిగా ఎంచడంతో సంతోషిస్తూ అపొస్తలులు న్యాయసభ నుండి బయటకు వెళ్లిపోయారు.


అంతేకాక, శ్రమలు ఓర్పును పుట్టిస్తాయని మనకు తెలుసు; కనుక శ్రమలలో కూడా మనం ఆనందించగలము.


అందుకే, క్రీస్తు కొరకు, నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. ఎందుకంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.


మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలలో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, సంఘమనే ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన బాధలలో మిగిలి వున్న వాటిలో నా వంతును, నా శరీరంలో పూర్తి చేస్తున్నాను.


మనం భరిస్తే, ఆయనతోపాటు మనం కూడా ఏలుతాము. మనం ఆయనను తిరస్కరిస్తే, ఆయన కూడా మనలను తిరస్కరిస్తారు;


క్రీస్తు కొరకైన అవమానాన్ని ఐగుప్తు ధనం కన్నా గొప్ప విలువైనదిగా భావించాడు, ఎందుకంటే అతడు తన బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు.


విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కొరకు ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.


నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కనుక,


పైగా క్రీస్తు బాధలలో పాలుపొందామని ఆనందించండి, దానివల్ల ఆయన మహిమ ప్రదర్శింపబడిన దినాన మీరు మహానందాన్ని అనుభవిస్తారు.


ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు విందురు గాక! వీటిని జయించినవారికి నేను దాచి ఉంచిన మన్నాను ఇస్తాను. నేను వారికి తెల్లని రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును ఇస్తాను. దాన్ని పొందినవారికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.


చివరి వరకు నా చిత్తం చేస్తూ జయించే వారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద అధికారం ఇస్తాను.


ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు విందురు గాక! వీటిని జయించినవారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తాను.


జయించువారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు.


జయించినవారిని నా దేవాలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. అప్పుడు వారు దానిలో నుండి ఎన్నడూ తొలగిపోలేరు. వారి మీద నేను నా దేవుని పేరును పరలోకంలో ఉన్న నా దేవుని నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అనే నా దేవుని పట్టణం పేరును వ్రాస్తాను, వాని మీద నేను నా క్రొత్త పేరును కూడా వ్రాస్తాను.


జయించువారు వారిలా తెల్లని వస్త్రాలు ధరించుకొంటారు. వాని పేరును నేను జీవగ్రంథంలో నుండి ఎన్నడు తుడిచివేయను నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు వాని పేరును ఒప్పుకుంటాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ