Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లూకా సువార్త 12:5 - తెలుగు సమకాలీన అనువాదము

5 మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తాను: మీ దేహం చంపబడిన తర్వాత, మిమ్మల్ని నరకంలో పడద్రోసే శక్తిగల వానికి భయపడండి. అవును, ఆయనకే భయపడండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఎవరికి మీరు భయపడాలో చెబుతాను. చంపిన తరువాత నరకంలో పడవేసే శక్తి గల వాడికి భయపడండి. ఆయనకే భయపడమని మీకు చెబుతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారమున్న వానికి భయపడండి! ఔను, ఆయనకు భయపడుమని చెబుతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తాను: మీ దేహం చంపబడిన తర్వాత, మిమ్మల్ని నరకంలో పడద్రోసే శక్తిగల వానికి భయపడండి. అవును, ఆయనకే భయపడండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తాను: మీ దేహం చంపబడిన తర్వాత, మిమ్మల్ని నరకంలో పడద్రోసే శక్తిగల వానికి భయపడండి. అవును, ఆయనకే భయపడండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లూకా సువార్త 12:5
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

శరీరాన్ని చంపి ఆత్మను చంపలేని వారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి.


“అప్పుడు ఆయన తన ఎడమ వైపున ఉన్న వారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి, అపవాది మరియు వాని దూతల కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్లిపొండి.


“అప్పుడు వారు నిత్య శిక్షలోనికి ప్రవేశిస్తారు, కాని నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు.”


కాని నేను చెప్పేది, తన సహోదరుని మీద కాని, సహోదరి మీద కాని కోపపడే ప్రతివాడు తీర్పుకు గురవుతాడు. అంతేకాక తన సహోదరుని కాని సహోదరిని కాని చూసి ద్రోహి అని పలికేవాడు న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాలి. వెర్రివాడ లేదా వెర్రిదాన అని పలికే ప్రతివాడు నరకాగ్నికి గురవుతాడు.


కనుక మీరు జాగ్రత్తగా ఉండండి; అందుకే ఈ విషయాలను నేను మీకు ముందుగానే చెప్పాను.


ఈ విషయంలో తన సహోదర సహోదరీలను అలుసుగా తీసుకొని మోసం చేయకూడదు. ఎందుకంటే, మేము ముందుగానే మీకు చెప్పి హెచ్చరించిన ప్రకారం అలాంటి పాపాలను చేసిన వారందరిని ఈ క్రియల విషయాల్లో ప్రభువు శిక్షిస్తారు.


సజీవుడైన దేవుని చేతుల్లో పడడం మహా భయంకరమైన విషయం.


ఎందుకంటే, దేవదూతలు పాపం చేసినపుడు దేవుడు వారిని విడిచిపెట్టక, వారిని సంకెళ్లతో బంధించి, చీకటి గల పాతాళానికి పంపి, తీర్పు దినం వరకు వారిని కాపలాలో ఉంచారు.


అతడు పెద్ద స్వరంతో, “దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించండి! ఎందుకంటే ఆయన తీర్పుతీర్చే ఘడియ వచ్చింది! ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని నీటి ఊటలను సృష్టించిన దేవుని ఆరాధించండి!” అని చెప్పాడు.


ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు, కనుక నీకు భయపడని వారు ఎవరు? నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు? నీ నీతి క్రియలు నిరూపించబడి ఉన్నాయి, కనుక భూజనులందరు నీ యెదుటకు వచ్చి ఆరాధిస్తారు,” అని దేవుని స్తుతించారు.


అప్పుడు మృత్యువు మరియు పాతాళం అగ్నిసరస్సులో పడవేయబడ్డాయి. ఈ అగ్నిసరస్సే రెండవ మరణం.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ