Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోహాను 8:19 - తెలుగు సమకాలీన అనువాదము

19 వారు ఆయనను, “నీ తండ్రి ఎక్కడ?” అని అడిగారు. అప్పుడు యేసు, “మీకు నా గురించి కాని నా తండ్రిని గురించి కాని తెలియదు. మీరు నన్ను తెలుసుకొని ఉంటే, నా తండ్రిని తెలుసుకొని ఉండేవారు” అని చెప్పారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 వారు–నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు–మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రిని కూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 వారు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. అందుకు యేసు, “మీకు నేను గానీ నా తండ్రి గానీ తెలియదు. ఒకవేళ నేను మీకు తెలిస్తే నా తండ్రి కూడా తెలిసే ఉంటాడు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 వారు ఆయనను, “నీ తండ్రి ఎక్కడ?” అని అడిగారు. అప్పుడు యేసు, “మీకు నా గురించి కాని నా తండ్రిని గురించి కాని తెలియదు. మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని తెలుసుకుని ఉండేవారు” అని చెప్పారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 వారు ఆయనను, “నీ తండ్రి ఎక్కడ?” అని అడిగారు. అప్పుడు యేసు, “మీకు నా గురించి కాని నా తండ్రిని గురించి కాని తెలియదు. మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని తెలుసుకుని ఉండేవారు” అని చెప్పారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోహాను 8:19
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ సమయంలో యేసు ఇలా అన్నారు, “తండ్రీ, భూమి ఆకాశములకు ప్రభువా, నీవు ఈ సంగతులను జ్ఞానులకు, తెలివైనవారికి మరుగుచేసి, చిన్నపిల్లలకు బయలుపరిచావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను.


ఆయన వలననే లోకం రూపించబడినా, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు.


ఎవ్వరూ ఎన్నడును దేవుని చూడలేదు, కానీ తానే దేవుడైయుండి, తండ్రితో అత్యంత సమీప సంబంధం కలిగియున్న, ఏకైక కుమారుడే ఆయనను మనకు తెలియపరిచారు.


నా నామంను బట్టి వారు మీ పట్ల ఇలా ప్రవర్తిస్తారు, ఎందుకంటే వారికి నన్ను పంపినవారెవరో తెలియదు అందుకే ఇలా చేస్తారు.


వారు నన్ను గాని, తండ్రిని గాని తెలుసుకోలేదు కనుక వారు ఇలాంటి పనులను చేస్తారు.


నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.


అప్పుడు యేసు ఇంకా దేవాలయ ఆవరణంలో బోధిస్తూ బిగ్గరగా, “అవును, నేను మీకు తెలుసు, నేను ఎక్కడివాడనో తెలుసు. అయినా నా అంతట నేను నా సొంత అధికారంతో ఇక్కడికి రాలేదు, అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు,


మీరు నీతిప్రవర్తన కలిగివుండి పాపం చేయకండి. దేవుడు తెలియనివారు కొందరు మీలో ఉన్నారు కనుక, మిమ్మల్ని సిగ్గుపరచడానికి ఇలా చెప్తున్నాను.


కాని ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు, లేక దేవుడు మిమ్మల్ని ఎరిగియున్నారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనక్కి ఆ బలహీనమైన దిక్కుమాలిన సిద్ధాంతాల వైపు ఎందుకు తిరుగుతున్నారు? మీరు మళ్ళీ వాటికి బానిసలవ్వాలని కోరుకుంటున్నారా?


మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం మరియు ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.


ప్రతి మంచి పనిలో సఫలమవుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించాలని,


కుమారుడు అదృశ్య దేవుని స్వరూపము, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు.


ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తరువాత, ఆయన పరలోకంలో ఉన్న మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు.


ఎందుకంటే, కుమారుని తిరస్కరించిన వారికి తండ్రి లేడు; కుమారుని అంగీకరించినవారికి తండ్రి కూడ ఉన్నాడు.


మనం సత్యవంతుడైన వానిని తెలుసుకునేలా చేయడానికి, దేవుని కుమారుడు వచ్చాడని, మనకు తెలివిని ఇచ్చారని మనకు తెలుసు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తునిలో ఉండుట ద్వారా సత్యవంతునిలో మనం ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవం.


క్రీస్తు బోధలో కొనసాగకుండా, దానిని దాటి వెళ్ళే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగివుంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ