Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోహాను 7:12 - తెలుగు సమకాలీన అనువాదము

12 ఆ జనసమూహంలో ఆయన గురించి చాలా ఎక్కువగా గుసగుసలు చెప్పుకొంటూ ఉన్నారు. వారిలో కొందరు, “అతడు మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 మరియు జనసమూహములలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొంద రాయన మంచివాడనిరి; మరికొందరు–కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ప్రజల మధ్య ఆయనను గురించి పెద్ద వాదం ప్రారంభమైంది. కొందరేమో, “ఆయన మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు. ఆయన మోసగాడు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 ప్రజలు ఆయన్ని గురించి రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు ఆయన మంచివాడన్నారు. మరి కొందరు, “కాదు, అతడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు!” అని అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 ఆ జనసమూహంలో ఆయన గురించి గుసగుసలు మొదలయ్యాయి. వారిలో కొందరు, “అతడు మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 ఆ జనసమూహంలో ఆయన గురించి గుసగుసలు మొదలయ్యాయి. వారిలో కొందరు, “అతడు మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోహాను 7:12
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటి వారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా!


కనుక వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కొరకు ఎదురు చూసారు, కాని ప్రజలందరు ఆయనను ప్రవక్త అని భావించడంతో వారికి భయపడ్డారు.


వారు, “అయ్యా, ఆ మోసగాడు జీవిస్తున్నప్పుడే, ‘మూడు దినాల తర్వాత నేను లేస్తాను’ అని పలికిన మాట మాకు జ్ఞాపకం ఉంది.


అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు.


శతాధిపతి, జరిగింది చూసి, “ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడు” అని చెప్పి దేవుని స్తుతించాడు.


అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు మరియు నీతిపరుడు.


మంచివారు తమ హృదయంలో నిండివున్న మంచి నుండి మంచివాటినే బయటికి తెస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయంలో నిండివున్న చెడు నుండి చెడ్డవాటినే బయటికి తెస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండివుందో దానినే నోరు మాట్లాడుతుంది.


వారందరు దేవుని భయంతో నిండి, “మన మధ్య ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు, దేవుడే తన ప్రజలను దర్శించాడు” అంటూ దేవుని స్తుతించారు.


యేసు చేసిన అద్బుత క్రియను చూసిన ప్రజలు, “నిజంగా ఈ లోకానికి రావలసివున్న ప్రవక్త ఈయనే” అని చెప్పుకోవడం మొదలుపెట్టారు.


ఆయన గురించి ఈ విషయాలను ఆ జనసమూహంలో గుసగుసలాడడం పరిసయ్యులు విన్నారు. అప్పుడు ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు ఆయనను బంధించడానికి దేవాలయ సంరక్షకులను పంపించారు.


పరిసయ్యులు, “అంటే మిమ్మల్ని కూడా అతడు మోసగించాడా? అని అన్నారు.


అందుకు వారు, “నీవు కూడ గలిలయకు చెందినవాడివా? ఇదిగో, గలిలయ నుండి ఏ ప్రవక్త రాడు కదా!” అన్నారు. [


పరిసయ్యులలో కొందరు, “ఇతడు సబ్బాతు దినాన్ని పాటించడంలేదు. కనుక ఇతడు దేవుని నుండి రాలేదు” అన్నారు. కానీ మరికొందరు ఒక పాపి ఇలాంటి అద్బుత క్రియలను ఎలా చేయగలుగుతాడు? అన్నారు. కనుక వారిలో భేదాలు ఏర్పడ్డాయి.


బర్నబా మంచివాడు, పరిశుద్ధాత్మతో మరియు విశ్వాసంతో నిండినవాడు, అతని ద్వార పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభువులోనికి చేర్చబడ్డారు.


ఒక మంచివాని కొరకు ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోవడమనేది చాలా అరుదు.


సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదానిని చేయండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ