Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోహాను 13:5 - తెలుగు సమకాలీన అనువాదము

5 ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్ళు పోసి, తన శిష్యుల కాళ్ళను కడిగి, తన చుట్టూ కట్టుకొని ఉన్న తువ్వాలుతో వాటిని తుడవడం మొదలుపెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 ఆ తర్వాత ఒక వెడల్పయిన పళ్ళెంలో నీళ్ళు పోసి తన శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టుకున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్లు పోసి, తన శిష్యుల పాదాలు కడిగి తాను కట్టుకుని ఉన్న తువాలు తీసి దానితో పాదాలు తుడవడం మొదలుపెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్లు పోసి, తన శిష్యుల పాదాలు కడిగి తాను కట్టుకుని ఉన్న తువాలు తీసి దానితో పాదాలు తుడవడం మొదలుపెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోహాను 13:5
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆమె ఆయన వెనుక పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ, ఆమె తన కన్నీళ్ళతో ఆయన పాదాలు తడపడం మొదలు పెట్టింది. తర్వాత తన తలవెంట్రుకలతో వాటిని తుడిచి, గౌరవంతో ఆయన పాదాలకు ముద్దు పెడుతూ పరిమళద్రవ్యాన్ని పూసింది.


తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోవడానికి నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు గానీ, ఈమె తన కన్నీళ్ళతో నా పాదాలను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది.


అందుకు యేసు, “స్నానం చేసినవారి శరీరం మొత్తం శుభ్రంగా ఉంటుంది, కనుక వారు పాదాలను మాత్రం కడుగుకొంటే చాలు; మీరు శుద్ధులే, కాని అందరు కాదు” అని అన్నారు.


ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు, “ప్రభువా, నీవు నా కాళ్ళు కడుగుతావా?” అని అడిగాడు.


పేతురు, “లేదు ప్రభువా, నీవు ఎప్పుడు నా కాళ్ళను కడుగకూడదు” అన్నాడు. అందుకు యేసు జవాబిస్తూ, “నేను నిన్ను కడుగకపోతే, నాతో నీకు పాలు ఉండదు” అన్నారు.


కాని సైనికులలో ఒకడు యేసుని బల్లెంతో ప్రక్కలో పొడిచాడు. వెంటనే రక్తం మరియు నీరు కారాయి.


నీవు ఇంకా దేని కొరకు ఎదురు చూస్తున్నావు? లేచి, ప్రభువు పేరున ప్రార్థన చేసి, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగివేసుకో అని చెప్పాడు.’


మీరు విమోచింపబడక ముందు మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మలో మీరు కడుగబడి పవిత్ర పరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డారు.


క్రీస్తు ప్రేమ తన సంఘాన్ని వాక్యమనే నీళ్ళ స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,


తన మంచిపనుల బట్టి సంఘంలో గుర్తింపు కలిగివుండాలి, అనగా పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, దేవుని ప్రజల పాదాలు కడగడం, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం అన్ని రకాల మంచి పనులు చేయడంలో ముందు ఉండాలి.


కనుక మన హృదయంలోని దోషాలు తొలగిపోయేలా శుద్ధిచేసుకొని, మన శరీరాలను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచుకొని, నిష్కపటమైన హృదయంతో విశ్వాసం వల్ల కలిగే పూర్తి నమ్మకంతో దేవుని సమీపిద్దాం.


అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము, ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనలను శుద్ధి చేస్తుంది.


నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవారు ఈయనే యేసు క్రీస్తు. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే రాలేదు, కాని నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చారు. ఆత్మ సాక్ష్యమిస్తున్నాడు ఎందుకంటే ఆత్మ సత్యం.


నమ్మకమైన సాక్షిగా, మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి, భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక! ఆయనే మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి,


అప్పుడు నేను, “అయ్యా, అది మీకే తెలుసు కదా” అని చెప్పగా, అతడు నాతో ఇలా అన్నాడు, వీరు మహా హింసలలో నుండి వచ్చినవారు. వీరు వధింపబడిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ