Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోహాను 13:31 - తెలుగు సమకాలీన అనువాదము

31 అతడు వెళ్లిపోయిన తర్వాత యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పొందాడు, అలాగే దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను–ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవుడును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు, “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందాడు. దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

31 యూదా వెళ్ళిపోయాక యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుని మహిమ వ్యక్తమయింది. అలాగే ఆయనలో దేవుని మహిమ వ్యక్తమయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 అతడు వెళ్లిపోయిన తర్వాత యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పొందాడు, అలాగే దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 అతడు వెళ్లిపోయిన తర్వాత యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పొందాడు, అలాగే దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోహాను 13:31
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు యేసు, “నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి గాని మనుష్యకుమారునికి కనీసం తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు” అని అతనికి జవాబిచ్చారు.


అయితే నేను ఒక బాప్తిస్మం పొందాల్సి ఉంది, అది నెరవేరే వరకు ఎంత నిర్బంధంలో ఉన్నానో!


యేసు అది విని, “ఈ అనారోగ్యం చావుకు దారి తీయదు. కానీ దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు.


అందుకు యేసు వారితో, “మనుష్యకుమారుడు మహిమ పొందే సమయం వచ్చింది.


తండ్రీ, నీ నామాన్ని మహిమపరచు!” అన్నారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను దానిని మహిమపరిచాను, మళ్ళీ నేను మహిమపరుస్తాను” అని వినిపించింది.


మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను.


ఆయన నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తూ నన్ను మహిమపరుస్తాడు.


ఆయనను నమ్మినవారు తర్వాత పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలను చెప్పారు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు గనుక ఆత్మ అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు.


“కనుక ఇశ్రాయేలు ప్రజలందరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఏంటంటే: మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగా మరియు క్రీస్తుగా చేశారు.”


మన పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచారు. మీరు ఆయనను చంపబడటానికి అప్పగించారు, పిలాతు ఆయనను విడుదల చేయాలని నిర్ణయించుకొన్నప్పటికి, మీరు అతని ముందు క్రీస్తును తిరస్కరించారు.


కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మ అయిన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.


ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయాన్ని బట్టి, సమస్త కార్యాలను జరిగిస్తున్నారు.


రాబోయే యుగాలలో ఆయన తన కృప యొక్క సాటిలేని ఐశ్వర్యాన్ని చూపించటానికి, క్రీస్తు యేసునందు మన పట్ల ఆయన దయలో వ్యక్తపరిచారు.


దేవుని ఉద్దేశమేంటంటే, సంఘం ద్వారా, దేవుని నానా విధాలైన జ్ఞానము వాయుమండలంలోని ప్రధానులకు అధికారులకు తెలియజేయబడాలి.


ప్రతి నాలుక యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.


మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.


యూదులు కాని మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.


ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవచేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి, అప్పుడు మనం అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక. ఆమేన్.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ