Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోహాను 1:14 - తెలుగు సమకాలీన అనువాదము

14 ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాము, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ఆ వాక్కు శరీరంతో మన మధ్య కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారునికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోహాను 1:14
60 ပူးပေါင်းရင်းမြစ်များ  

యాకోబు కుమారుడు మరియకు భర్తయైన యోసేపు, యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి మరియ.


దావీదు పట్టణంలో ఈ రోజే రక్షకుడు మీ కొరకు పుట్టాడు; ఆయన ప్రభువైన క్రీస్తు.


సత్రంలో వారికి స్థలం దొరకలేదు, కనుక ఆమె ఆ శిశువును మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది.


పేతురు మరియు అతనితో ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారు, కానీ వారు పూర్తిగా మేల్కొనినప్పుడు, ఆయన మహిమను మరియు ఇద్దరు వ్యక్తులు ఆయనతో నిలబడి ఉండడం చూసారు


ఆదిలో వాక్యం ఉన్నది. ఆ వాక్యం దేవునితో ఉన్నది, ఆ వాక్యమే దేవుడు.


అప్పుడు యేసు, “నీవు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నారు.


అందుకు యేసు, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.


యేసు అతనితో, “ఫిలిప్పూ, నేను ఇంతకాలం ఉన్నాక కూడా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు తండ్రిని చూసాడు, కనుక ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు?


మనం ఏకంగా ఉన్నట్లు వారు కూడ ఏకంగా ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను.


“తండ్రీ, నీవు నన్ను సృష్టికి పునాది వేయబడక ముందే ప్రేమించి నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడడానికి నేను ఎక్కడ ఉంటానో అక్కడ, నీవు నాకు ఇచ్చిన వారందరు కూడా ఉండాలని నేను కోరుకొంటున్నాను.


అప్పుడు పిలాతు, “అయితే నీవు రాజువా?” అని అడిగాడు. అందుకు యేసు, “నేను రాజునని నీవే చెప్తున్నావు. నిజానికి, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలో జన్మించాను. సత్యం వైపు ఉన్నవారందరు నా మాటలను వింటారు” అని జవాబిచ్చారు.


గలిలయ ప్రాంతపు కానాలో యేసు ఈ మొదటి అద్బుతం చేసి తన మహిమను కనుపరిచారు. దీని వలన ఆయన శిష్యులు ఆయనను నమ్మారు.


దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కనుక తన యందు విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుడిని అనుగ్రహించారు.


ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు, కాని నమ్మనివాడు శిక్షకు పాత్రుడని తీర్చబడ్డాడు, ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుని పేరు నందు నమ్మకముంచలేదు.


పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవరైనా ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.


అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకొంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది” అని చెప్పారు.


యేసును మరణం నుండి లేపడం ద్వారా ఆయన పిల్లలంగా ఉన్న మనకొరకు నెరవేర్చారు. రెండవ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.’


శరీరాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయడానికి శక్తిహీనంగా ఉండిందో, దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారార్థ బలిగా ఉండడానికి తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు,


పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవ వంశావళి వారిలో నుండే గుర్తించబడింది. నిత్యం స్తుతింపబడునుగాక! ఆమేన్.


మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు.


అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండడానికి ముఖ్యంగా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.


అయితే నియమించబడిన కాలం పూర్తి అయినప్పుడు, దేవుడు తన కుమారున్ని, ధర్మశాస్త్ర ఆధీనంలో, ఒక స్త్రీ ద్వారా జన్మింపజేసారు,


ప్రభువు ప్రజలలో నేను అత్యంత అల్పున్ని కానీ లెక్కించలేని ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో ఉన్నాయని యూదేతరులకు ప్రకటించడానికి దేవుడు తన దయతో నన్ను ఏర్పరచుకొన్నారు.


ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం.


బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడివున్నాయి.


ఎందుకంటే, పరిపూర్ణ దైవత్వం శరీర రూపంలో క్రీస్తులో జీవిస్తుంది.


నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే: ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు, పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు, దేవదూతలు ఆయనను చూసారు, ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు, ఆయన గురించి లోకమంతా నమ్మింది, ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకొనివెళ్ళారు.


ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తరువాత, ఆయన పరలోకంలో ఉన్న మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు.


దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు, “నీవు నా కుమారుడివి; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని గాని, “నేను ఆయనకు తండ్రిగా ఉంటాను, ఆయన నాకు కుమారునిగా ఉంటాడు,” అని గాని అన్నారా?


అందుకని, క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు ఇలా అన్నారు: “నీవు బలులను అర్పణలను కోరలేదు, కాని నీవు నాకొక శరీరాన్ని సిద్ధపరచావు;


ప్రజలను పరిశుద్ధపరచే వానిది పరిశుద్ధపరచబడిన వారిది ఒక్కటే కుటుంబం. కనుక వారిని సహోదరీ సహోదరులని పిలువడానికి యేసు సిగ్గుపడలేదు.


అదేరీతిగా, క్రీస్తు కూడా ప్రధాన యాజకునిగా అవ్వడానికి తనంతట తానే మహిమను తీసుకోలేదు. అయితే దేవుడే ఆయనతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.”


మరియు లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం చూశాము సాక్ష్యమిచ్చాము.


దేవుడు మన మధ్య తన ప్రేమను ఈ విధంగా చూపించారు: ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు.


ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మానవ శరీరంతో వచ్చారని ఒప్పుకొనని చాలామంది మోసగాళ్ళు లోకంలో బయలుదేరారు. అలాంటి వాడు మోసగాడు, క్రీస్తు విరోధి.


రక్తంలో ముంచబడిన వస్త్రాలను ఆయన ధరించి ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యమని పేరు.


అప్పుడు దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, “ఇదిగో, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యుల మధ్యలో ఉంది, ఆయన వారితో నివసిస్తాడు. అప్పుడు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారికి దేవుడై ఉంటాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ