Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యాకోబు 4:8 - తెలుగు సమకాలీన అనువాదము

8 దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను కడుగుక్కోండి, రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా! మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యాకోబు 4:8
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

“చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదవుతుంది, ఎందుకంటే చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది.


“నీ శిష్యులు చేతులు కడుక్కోకుండ భోజనం చేస్తున్నారు. వారు పెద్దల సాంప్రదాయాన్ని ఎందుకు పాటించరు?” అని అడిగారు.


పిలాతు అల్లరి ఎక్కువ అవుతుంది తప్ప తాను ఏమి చేయలేకపోతున్నానని గ్రహించి, నీళ్లు తీసికొని ప్రజలందరి ముందు తన చేతులను కడుక్కొని, “ఈయన రక్తం విషయంలో నేను నిర్దోషిని, ఇక మీదే బాధ్యత!” అని చెప్పాడు.


దేవుడు మనకు వారికి మధ్య ఏ భేదం చూపించకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచారు.


ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగివున్నాం కనుక, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాం.


కనుక ప్రతిచోట పురుషులు పవిత్రమైన చేతులను పైకెత్తి, కోపం లేదా కలహభావం లేకుండా ప్రార్థించాలని నేను కోరుతున్నాను.


కనుక మన హృదయంలోని దోషాలు తొలగిపోయేలా శుద్ధిచేసుకొని, మన శరీరాలను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచుకొని, నిష్కపటమైన హృదయంతో విశ్వాసం వల్ల కలిగే పూర్తి నమ్మకంతో దేవుని సమీపిద్దాం.


ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం దేన్ని పరిపూర్ణం చేయలేదు, కనుక మనల్ని దేవునికి దగ్గర చేసే, మెరుగైన నిరీక్షణ పరిచయం చేయబడింది.


అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగివుంటారు, తాము చేసే వాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు.


పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛముగా ఉంటుంది, తరువాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది.


ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు, తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగివుండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా అధికంగా ప్రేమించుకోండి.


ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది, శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది.


ఆయనలో నిరీక్షణ ఉంచు ప్రతివారు, ఆయన పవిత్రుడై ఉన్నట్లే, తనను పవిత్రునిగా చేసుకుంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ