Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యాకోబు 4:1 - తెలుగు సమకాలీన అనువాదము

1 మీ మధ్యలో ఉన్న పోరాటాలు, గొడవలు ఎక్కడ నుండి వచ్చాయి? మీలో పోరాడుతున్న దురాశల నుండి వచ్చినవే కదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 మీ మధ్యలో ఉన్న తగాదాలు, గొడవలు ఎక్కడ నుండి వచ్చాయి? మీలో పోరాడుతున్న దురాశల నుండి వచ్చినవే కదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 మీ మధ్యలో ఉన్న తగాదాలు, గొడవలు ఎక్కడ నుండి వచ్చాయి? మీలో పోరాడుతున్న దురాశల నుండి వచ్చినవే కదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యాకోబు 4:1
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎందుకంటే, హృదయంలో నుండే నరహత్య, వ్యభిచారం, లైంగిక అనైతికత, దొంగతనం, అబద్ధ సాక్ష్యం మరియు దూషణ అనే చెడ్డ ఆలోచనలు వస్తాయి.


మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కనుక మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కనుక వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు, వాడు తన స్వభాషలో మాట్లాడతాడు, ఎందుకంటే వాడు అబద్ధికుడు మరియు అబద్ధాలకు తండ్రి.


కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది, అది నా మనస్సులోని నియమంతో పోరాడుతున్నది, నాలో పని చేస్తున్న పాపనియమానికి అది నన్ను బంధీగా చేస్తుంది.


మనం శరీరం యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం చేత రేపబడిన పాపపూరితమైన ఆలోచనలు మనలో పని చేస్తున్నాయి కనుక మనం మరణాన్ని ఫలంగా పొందుకుంటున్నాము.


శరీరంచే పాలించబడే మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు.


శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కనుక మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు.


కనుక మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధన అయిన దురాశలను చంపివేయండి.


మూర్ఖపు అవివేకమైన వాదనలను విసర్జించు, ఎందుకంటే అవి గొడవలను పుట్టిస్తాయని నీకు తెలుసు.


ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాం. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము.


అయితే మూర్ఖమైన వివాదాలకు, వంశావళులకు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదాలకు కలహాలకు దూరంగా ఉండు, ఎందుకంటే అవి నిష్ఫలమైనవి వ్యర్థమైనవి.


ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురికావడం వల్ల శోధించబడతారు;


మీరు పొందినదానిని మీ సంతోషాల కొరకు ఉపయోగించుకోవాలనే దురుద్ధేశ్యంతో అడుగుతారు కాబట్టి మీరు ఏమి పొందలేదు.


మీరు విధేయత కలిగిన బిడ్డలు కనుక, అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు గల చెడ్డకోరికలకు అనుగుణంగా ఉండకండి.


ప్రియ మిత్రులారా, ఈ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కనుక వాటికి విడిచిపెట్టండి.


ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు గలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకొన్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు.


అన్నిటికి మించి, అంత్యదినాలలో అపహాసకులు వస్తారని మీరు గ్రహించలి, వారు అపహాస్యం చేస్తూ తమ చెడుకోరికలను అనుసరిస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ