Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హెబ్రీయులకు 13:18 - తెలుగు సమకాలీన అనువాదము

18 మా కొరకు ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచుమంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 అన్ని విషయాల్లో యోగ్యంగా జీవించాలనే మంచి మనస్సాక్షి మాకుందని నమ్ముతున్నాం. మా కోసం ప్రార్ధించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 మా కోసం ప్రార్థించండి. మా అంతరాత్మలు నిర్మలమైనవనే విశ్వాసం మాకు ఉంది. మేము అన్ని విధాలా గౌరవప్రదంగా జీవించాలనుకొంటున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 మాకోసం ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 మాకోసం ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హెబ్రీయులకు 13:18
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు.


కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మరియు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.


చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. ప్రతి ఒక్కరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి.


అతి త్రాగుడు మత్తు, లైంగిక అనైతికత వ్యభిచారం, కలహాలు, ఓర్వలేనితనం మొదలైన వాటిని విడిచి, పగటివేళలో వలె మనం మర్యాదగా ప్రవర్తిద్దాం.


సహోదరీ సహోదరులారా, నా కొరకు దేవునికి ప్రార్థించడం ద్వారా మీరు కూడా నా పోరాటంలో చేరాలని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మలోని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాను.


ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితీతో, దేవుడు అనుగ్రహించు పవిత్రతతో మేము నడుచుకొన్నాము, లోకజ్ఞానంపై ఆధారపడకుండా దేవుని కృపపై ఆధారపడి నడుచుకొన్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది.


చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి.


నేను సంకెళ్ళతో ఉండడానికి కారణమైన క్రీస్తు మర్మాన్ని మేము ప్రకటించడానికి, మా సువార్త పరిచర్యకు దేవుడు ద్వారాలను తెరవాలని మా కొరకు కూడా ప్రార్థన చేయండి.


అప్పుడు మీ అనుదిన జీవితం బయటి వారి గౌరవాన్ని గెలుచుకుంటుంది, మీరు ఎవరిపైనా ఆధారపడేవారిగా ఉండరు.


సహోదరీ సహోదరులారా, మా కొరకు ప్రార్థించండి.


సహోదరీ సహోదరులారా, మిగిలిన విషయాలు ఏంటంటే, ప్రభువు వాక్యం మీలో వ్యాపించిన ప్రకారమే మరింతగా వేగంగా వ్యాపించి ఘనత పొందేలా మా కొరకు ప్రార్థించండి.


ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ప్రేమ; అది స్వచ్ఛమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, యదార్థమైన విశ్వాసం నుండి కలుగుతుంది.


యూదులు కాని మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.


మీ మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోండి, ఎలాగంటే, మిమ్మల్ని ఎవరైన దూషిస్తే, అప్పుడు క్రీస్తులో ఉన్న మీ మంచి ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడేవారు తమ మాటలకు తామే సిగ్గుపడతారు.


ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది, శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ