Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హెబ్రీయులకు 11:32 - తెలుగు సమకాలీన అనువాదము

32 ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

32 ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

32 ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకును గురించి, సమ్సోనును గురించి, యెఫ్తాను గురించి, దావీదును గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

32 ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనేవారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

32 ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనేవారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హెబ్రీయులకు 11:32
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

సంతోషించి ఆనందించండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు.


“మీరు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు ప్రవక్తలందరిని దేవుని రాజ్యంలో చూస్తారు, కానీ మీరు మాత్రం వెలుపటికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం, పండ్లు కొరకడం ఉంటాయి.


“అందుకు అబ్రాహాము అతనితో, ‘వారు మోషే మరియు ప్రవక్తల మాటలను విననప్పుడు, చనిపోయినవారిలో నుండి ఒకడు లేచి వెళ్లినా నమ్మరు’ అన్నాడు.”


యేసు చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాస్తే, వ్రాసిన గ్రంథాలను ఉంచడానికి ఈ ప్రపంచమంతా కూడా సరిపోదు అని నేను భావిస్తున్నాను.


ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.”


సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఈ సంఘటనలన్నీ జరిగాయి. “ఆ తర్వాత, సమూయేలు ప్రవక్త కాలం వరకు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చారు.


“నిజానికి సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరు ఈ రోజుల గురించి ముందే ప్రవచించారు.


అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మన మీద చూపితే ఆయన అన్యాయస్థుడు అవుతాడా? నేను మానవుల వాదన చెప్తున్నాను.


అయితే శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాము ఈ విషయంలో ఏమి తెలుసుకున్నాడు అని మనం అనవచ్చు?


అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా?


అయితే, మనం ధర్మశాస్త్రాన్ని పాపం అని అనాలా? ఖచ్చితంగా కాదు! ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. “మీరు ఆశించకూడదు” అని ధర్మశాస్త్రం చెప్పకపోతే ఆశించడం అంటే ఏమిటో నిజంగా నాకు తెలిసేది కాదు.


సహోదరీ సహోదరులారా, మన ప్రభువు నామంలో మాట్లాడిన ప్రవక్తలను శ్రమలకు ఓపికకు మాదిరిగా తీసుకోండి.


ఎందుకంటే, మానవుని ఇష్టాన్ని బట్టి ప్రవచనం పుట్టదు, కాని ప్రవక్తలు పరిశుద్ధాత్మచేత ప్రభావితులై దేవుని నుండి వచ్చిన సందేశాన్నే పలికారు.


పూర్వకాలంలో పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలుకబడిన వాక్యాలను, మన ప్రభువైన రక్షకుని వలన అపొస్తలుల ద్వారా మీకు ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ