Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హెబ్రీయులకు 1:2 - తెలుగు సమకాలీన అనువాదము

2 కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హెబ్రీయులకు 1:2
70 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ కలుపులను విత్తిన శత్రువు అపవాది. కోతకాలం ఈ యుగసమాప్తి సమయం మరియు ఆ కోత కోసేవారు దేవదూతలు.


అతడు ఇంకా మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం వారిని కమ్ముకొని ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను, కనుక ఈయన మాటలను వినండి!” అని చెప్పడం వినిపించింది.


“కాని ఆ కౌలు రైతులు కుమారుని చూసి ‘ఇతడే వారసుడు, రండి ఇతన్ని చంపి ఇతని వారసత్వాన్ని తీసుకొందాం’ అని తమలో తాము చెప్పుకొన్నారు.


అయితే యేసు మౌనంగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు.


యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది.


మరియు పరలోకం నుండి ఒక స్వరం: “ఈయన నా కుమారుడు, నేను ప్రేమించే వాడు; ఈయన యందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది.


దేవుని కుమారుడైన క్రీస్తు యేసును గురించిన సువార్త ప్రారంభం.


“పంపడానికి అతని దగ్గర ఒకడే మిగిలాడు, తాను ఎంతో ప్రేమించే, తన కుమారుడు. ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, చివరిగా అతన్ని పంపాడు.


“కాని వారు ఒకరితో ఒకరు, ‘ఇతడే వారసుడు, రండి, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని అనుకున్నారు.


ఆయన వలననే లోకం రూపించబడినా, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు.


ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాము, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.


సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు.


తండ్రి అన్నిటిని తన అధికారం క్రింద ఉంచాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చాడని, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడని యేసుకు తెలుసు.


దేవుడు కుమారునిలో మహిమపొందితే, దేవుడు తనలో కుమారుని మహిమపరచుకొనిన వెంటనే కుమారుని మహిమపరుస్తాడు.


నేను మిమ్మల్ని సేవకులని ఇక పిలువను. ఎందుకంటే ఏ సేవకునికైనా తన యజమానుడు చేసే పనులు తెలియవు. నేనైతే మిమ్మల్ని స్నేహితులనే పిలిచాను. ఎందుకంటే నేను నా తండ్రి నుండి విన్న విషయాలన్నింటిని మీకు తెలియజేసాను.


నా తండ్రికి ఉన్నవన్ని నావే. అందుకే ఆత్మ నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను.”


నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరికి నిత్యజీవం అనుగ్రహించడానికి ప్రజలందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు.


దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కనుక తన యందు విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుడిని అనుగ్రహించారు.


ఒక దినము శుద్ధీకరణ ఆచారం గురించి యోహాను శిష్యులలో కొందరికి ఒక యూదునితో వివాదం ఏర్పడింది.


తండ్రి తనలో జీవం కలిగివున్న ప్రకారం, కుమారునిలో కూడా జీవం కలిగి ఉండేలా ఆయనకు అధికారం ఇచ్చారు.


మరియు ఆయన మనుష్యకుమారుడు కనుక తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇచ్చారు.


దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చాడో కూడ మాకు తెలియదు” అన్నారు.


అందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీకు తెలుసు.


“ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజులలో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనస్థులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు.


ఆయన మృతులలో నుండి పునరుత్థానుడు అవ్వడం వలన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారునిగా అధికారంతో నిరూపించబడ్డారు.


మనం పిల్లలమైతే వారసులం అవుతాము అంటే దేవుని వారసులం; క్రీస్తు మహిమను మనం కూడా పొందేలా ఆయన శ్రమల్లో మనం పాలుపంచుకొంటే క్రీస్తుతో సహ వారసులం అవుతాము.


అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము, అది, ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కొరకు దాచియుంచిన మర్మం.


కానీ మనకైతే ఒక్కడే తండ్రియైన దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన కోసమే మనం జీవిస్తున్నాం; అలాగే మనకు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం.


అయితే నియమించబడిన కాలం పూర్తి అయినప్పుడు, దేవుడు తన కుమారున్ని, ధర్మశాస్త్ర ఆధీనంలో, ఒక స్త్రీ ద్వారా జన్మింపజేసారు,


కాలం సంపూర్ణమైనప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, అనగా పరలోకంలో ఉన్న వాటినే గాని భూమి మీద ఉన్న వాటినే గాని సమస్తాన్ని క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని నిర్ణయించుకొన్నారు.


సమస్తాన్ని సృజించిన దేవుడు అనాది నుండి దాచబడివున్న ఆ మర్మాన్ని, ప్రజలందరికి తెలియచేయడానికి ఆ కృపను నాకు అనుగ్రహించారు.


దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు, “నీవు నా కుమారుడివి; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని గాని, “నేను ఆయనకు తండ్రిగా ఉంటాను, ఆయన నాకు కుమారునిగా ఉంటాడు,” అని గాని అన్నారా?


కాని తన కుమారుని గురించి ఆయన, “ఓ దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; న్యాయమనేది నీ రాజ్యానికి రాజదండం.


దేవుని ఆజ్ఞ చేత సృష్టి రూపించబడింది, కనుక కనిపించే వాటినుండి కనిపిస్తున్నవి చేయబడలేదని విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తున్నాం.


మనం గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, మనం ఎలా తప్పించుకోగలం? ఈ రక్షణను ప్రభువే మొదట ప్రకటించారు. ఆయన మాటలు విన్నవారి ద్వారా అది మనకు నిరూపించబడింది.


అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహం.


కాబట్టి, పరలోకంలోకి ఎక్కివెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం అంగీకరించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొందాం.


ఆయన కుమారుడై ఉండి కూడా, తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొన్నారు,


ధర్మశాస్త్రం బలహీనతతో ఉన్న మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమిస్తుంది; కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన దేవుని ప్రమాణం నిత్యం పరిపూర్ణునిగా చేయబడిన దేవుని కుమారున్ని ప్రధాన యాజకునిగా నియమించింది.


తల్లి తండ్రి లేకపోయినా, వంశావళి లేకపోయినా, జీవిత ఆరంభం అంతం లేకపోయినా అతడు దేవుని కుమారునికి సాదృశ్యంగా, నిరంతరం యాజకునిగా ఉన్నాడు.


లేకపోతే ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండి అనేకసార్లు క్రీస్తు శ్రమపడాల్సి ఉండేది. అయితే తనను తాను బలిగా అర్పించుకోవడం ద్వారా ప్రజల అపరాధాలను పూర్తిగా కొట్టివేయాలని అన్ని యుగాల కొరకు ఒక్కసారే ఆయన ప్రత్యక్షమయ్యాడు.


లోకం సృజింపబడక ముందే ఆయన దేవునిచే ఎన్నుకోబడ్డారు కాని మీ కొరకు ఈ చివరి కాలాల్లో బయలుపరచబడ్డారు.


అన్నిటికి మించి, అంత్యదినాలలో అపహాసకులు వస్తారని మీరు గ్రహించలి, వారు అపహాస్యం చేస్తూ తమ చెడుకోరికలను అనుసరిస్తారు.


“అంత్యకాలంలో, తమ భక్తిహీనమైన కోరికలనే అనుసరించే అపహాసకులు ఉంటారు” అని వారు మీకు చెప్పారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ