Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




గలతీయులకు 6:8 - తెలుగు సమకాలీన అనువాదము

8 తమ శరీరాలను సంతోషపరచడానికి విత్తేవారు తమ శరీరం నుండి నాశనమనే పంట కోస్తారు. తమ ఆత్మను సంతోషపరచడానికి విత్తేవారు తమ ఆత్మ నుండి నిత్యజీవమనే పంటను కోస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 తమ శరీరాలను సంతోషపరచడానికి విత్తేవారు తమ శరీరం నుండి నాశనమనే పంట కోస్తారు. తమ ఆత్మను సంతోషపరచడానికి విత్తేవారు తమ ఆత్మ నుండి నిత్యజీవమనే పంటను కోస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 తమ శరీరాలను సంతోషపరచడానికి విత్తేవారు తమ శరీరం నుండి నాశనమనే పంట కోస్తారు. తమ ఆత్మను సంతోషపరచడానికి విత్తేవారు తమ ఆత్మ నుండి నిత్యజీవమనే పంటను కోస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




గలతీయులకు 6:8
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా నామంను కలిగి ఉన్నందుకు తన కుటుంబాన్ని, అనగా సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను లేక పొలాలను గృహాలను నా కొరకు విడిచిపెట్టిన ప్రతివాడు నూరురెట్లు పొందుకొని, నిత్యజీవానికి వారసుడు అవుతాడు.


“అప్పుడు వారు నిత్య శిక్షలోనికి ప్రవేశిస్తారు, కాని నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు.”


కానీ నేనిచ్చే నీళ్ళను త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్ళు వారికి నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు.


పంటను కోసేవాడు తన జీతం తీసుకొని, పంటను విత్తినవాడు మరియు కోసేవాడు ఇద్దరూ సంతోషించేలా, పంట అంతా కోసి నిత్యజీవం కొరకు కూర్చుకొంటాడు.


మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు.


అయితే, మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తృప్తిపరచాలని ఆలోచించకండి.


దుష్టత్వాన్ని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి ఇవ్వవద్దు, కాని మరణం నుండి జీవంలోనికి తీసుకొనిరాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించండి.


పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసుక్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.


యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన, నాశనమయ్యే మీ శరీరాలకు కూడా జీవాన్ని ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నాడు.


మీరు శరీరానుసారంగా జీవిస్తే, మీరు మరణిస్తారు, కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే, మీరు బ్రతుకుతారు.


శరీరంచే పాలించబడే మనస్సు మరణము, కాని ఆత్మచే పాలించబడే మనస్సు జీవం మరియు సమాధానమై ఉన్నది.


మరణించినవారి పునరుత్థానం కూడా ఇలాగే ఉంటుంది. నాటబడిన శరీరం నశించిపోయేది, అయితే అది నాశనంలేనిదిగా లేపబడుతుంది.


మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడరు. ఒకరు దేన్ని విత్తుతారో దాని పంటనే కోస్తారు.


అయితే ఆ కారణంగానే, నిత్యజీవాన్ని పొందడానికి ఆయనలో నమ్మకముంచబోయే వారికి మాదిరిగా ఉండడానికి, అతి దుష్టుడనైన నాలో క్రీస్తు యేసు తన యొక్క అపరిమితమైన దీర్ఘశాంతాన్ని చూపించారు.


కనుక ఆయన కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడి, నిత్యజీవం గురించి నిరీక్షణ కలిగిన వారసులం అవుతున్నాము.


శాంతిలో విత్తిన శాంతిని కలుగచేసినవారు నీతి అనే పంట కోస్తారు.


కాని ఈ ప్రజలు తాము గ్రహించలేని విషయాలను దూషిస్తారు. వారు స్వాభావికంగా పట్టబడడానికి, నశించడానికి పుట్టిన వివేకంలేని జంతువుల వంటివారు, ఆ జంతువుల్లా వీరు కూడా నశించిపోతారు.


తామే దుర్నీతికి బానిసలై ఉండి, అలాంటి వారికి స్వాతంత్ర్యం ఇస్తామని చెప్తారు. ఎందుకంటే “ఒకరు దేని చేతిలో ఓడిపోతారో దానికే దాసులవుతారు.”


మీకు నిత్యజీవాన్ని దయచేసే మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరం కొరకు మీరు ఎదురుచూస్తూ ఉంటూ మీరు దేవుని ప్రేమలో నిలిచివుండండి.


అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ