Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




గలతీయులకు 4:19 - తెలుగు సమకాలీన అనువాదము

19 నా ప్రియ పిల్లలారా, మీలో క్రీస్తు రూపించబడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడువరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదన పడ్తూ ఉండవలసిందే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 నా ప్రియ పిల్లలారా, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 నా ప్రియ పిల్లలారా, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




గలతీయులకు 4:19
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన బహు వేదనతో, మరింత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేల మీద పడుతూ ఉంది.


అయితే, మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తృప్తిపరచాలని ఆలోచించకండి.


అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు.


నేను మూడవసారి మీ దగ్గరకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, మీకు భారంగా ఉండను, ఎందుకంటే నాకు కావల్సింది మీ ధనం కాదు కాని మీరే. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు పొదుపు చేసి ఉంచాలి.


మరియు నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి.


యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగివున్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు.


మీ విశ్వాస యాగంలో సేవలో పానార్పణగా నేను పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను.


మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగివున్న స్వభావాన్నే మీరు కూడా కలిగివుండండి.


యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియచేయబడింది.


మీ కొరకు లవొదికయలో ఉన్న వారి కొరకు, వ్యక్తిగతంగా నన్ను కలుసుకొనని వారందరి కొరకు నేను ఎంతగా కష్టపడుతున్నానో మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.


మరియు సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు.


క్రీస్తు యేసు సేవకుడును మీలో ఒకడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు పరిపూర్ణులుగా ప్రతివిషయంలో దేవుని చిత్తం గురించి పూర్తి నిశ్చయతగలవారై స్థిరంగా ఉండాలని, ఇతడు ఎప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతూ ఉంటాడు.


కాని, మీ మధ్యలో చిన్నబిడ్డల్లా మృదువుగా ఉన్నాము. పాలిచ్చు తల్లి తన పిల్లలను ప్రేమగా చూసుకొనేలా,


విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది: తండ్రియైన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరం, సమాధానములు కలుగును గాక.


విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు, తీతుకు: మన తండ్రియైన దేవుని నుండి, రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగును గాక.


నేను సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు నాకు కుమారునిగా మారిన ఒనేసిము కొరకు నిన్ను వేడుకుంటున్నాను.


పౌలు అను నేను, నా స్వహస్తంతో దీనిని వ్రాస్తున్నాను. నేను ఆ లెక్క చెల్లిస్తాను. నిజానికి, స్వయాన నీవే నాకు బాకీగా ఉన్నావని చెప్పనవసరం లేదు.


యేసు భూమి మీద జీవించిన రోజులలో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీళ్లతో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు.


ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.


నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు.


ప్రియ పిల్లలారా, నేను మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే, ఆయన నామం వలన మీ పాపాలు క్షమించబడ్డాయి.


చిన్న పిల్లలారా, విగ్రహాలకు దూరంగా ఉండండి.


నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ