Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




గలతీయులకు 4:15 - తెలుగు సమకాలీన అనువాదము

15 అయితే నా వలన మీరు పొందిన దీవెన ఇప్పుడేమైపోయింది? మీరు మీ సొంత కళ్ళను కూడా పెరికివేసి నాకు ఇచ్చేవారని, నేను మీ గురించి సాక్ష్యమివ్వగలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్య మైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 మీ సంతోషం ఇప్పుడు ఏమయింది? వీలుంటే మీ కళ్ళు తీసి నాకిచ్చేసే వారని మీ గురించి సాక్ష్యం చెప్పగలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అయితే నా వలన మీరు పొందిన దీవెన ఇప్పుడేమైపోయింది? మీరు మీ కళ్లను కూడా పెరికివేసి నాకు ఇచ్చేవారని, నేను మీ గురించి సాక్ష్యమివ్వగలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అయితే నా వలన మీరు పొందిన దీవెన ఇప్పుడేమైపోయింది? మీరు మీ కళ్లను కూడా పెరికివేసి నాకు ఇచ్చేవారని, నేను మీ గురించి సాక్ష్యమివ్వగలను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




గలతీయులకు 4:15
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాతి నేలలో పడిన విత్తనాలు ఎవరంటే, వారు వాక్యన్ని విన్నప్పుడు దానిని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు ఉండదు. వారు కొంతకాలమే నమ్ముతారు, శోధన సమయంలో త్వరగా పడిపోతారు.


అప్పుడు వారు దేవుని పట్ల అత్యాసక్తి కలిగివున్నారని అయితే వారి అత్యాసక్తి జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదని నేను సాక్ష్యమివ్వగలను.


పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగివుండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.


ఆయన ద్వారానే విశ్వాసం చేత ఇప్పుడు మనం నిలిచి ఉన్న కృపలోనికి రాగలిగాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయిద్దాం


నా సొంత జాతి వారైన, ఇశ్రాయేలీయుల కొరకు క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను.


ఎందుకంటే, తాము ఇవ్వగలిగిన దానికన్నా, తమ సామర్థ్యాన్ని మించి వారు ఇచ్చారని నేను సాక్ష్యమిస్తాను.


విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను గురించిన వాగ్దానాన్ని మనం పొందుకొనేలా అబ్రాహాముకు ఇవ్వబడిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కూడా రావాలని ఆయన మనల్ని విమోచించారు.


నా అనారోగ్యం మీకు ఇబ్బందిని కలిగించినప్పటికీ, మీరు నా పట్ల తిరస్కారాన్ని లేదా అలక్ష్యాన్ని చూపించలేదు. నిజానికి, మీరు నన్ను దేవుని దూతలా, నేనే యేసుక్రీస్తును అయినట్లు చేర్చుకున్నారు.


అయితే ఇప్పుడు మీకు సత్యాన్ని చెప్పడం వల్ల నేను మీకు శత్రువుగా మారానా?


నా ప్రియ పిల్లలారా, మీలో క్రీస్తు రూపించబడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను.


అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం,


ప్రతీ ఒక్కరు తమ తమ పనులను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరులతో తమను పోల్చుకోకుండా కేవలం తమను బట్టి తామే గర్వపడగలరు.


ఇతడు మీ కొరకు, లవొదికయలో హియెరాపొలిలో ఉన్న వారి కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడని ఇతన్ని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను.


మేమైతే మిమ్మల్ని చూసుకున్నాము. మిమ్మల్ని ఎంతో ప్రేమించాము, కాబట్టి మీతో దేవుని సువార్తను పంచుకోవడమే కాకుండా మా జీవితాలను కూడా మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.


వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ