Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




గలతీయులకు 1:1 - తెలుగు సమకాలీన అనువాదము

1 పౌలు, అనే నేను మనుష్యుల నుండి గాని లేక ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 మనుష్యుని నుండియైనను, మనుష్యుని ద్వారానైనను కాక, యేసు క్రీస్తు ద్వారాను, ఆయనను మరణములో నుండి లేపిన తండ్రియైన దేవుని ద్వారాను అపొస్తలుడనైన పౌలు నుండియు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 పౌలు అనే నేను మనుష్యుల ద్వారా గాని ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 పౌలు అనే నేను మనుష్యుల ద్వారా గాని ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




గలతీయులకు 1:1
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను నా తండ్రి ఏకమై ఉన్నాం” అన్నారు.


యేసు మళ్ళీ వారితో, “మీకు సమాధానం కలుగును గాక! నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని చెప్పారు.


కనుక యేసు వారితో మాట్లాడుతూ, “నేను మీతో చెప్పేది నిజం, కుమారుడు తనకు తానుగా ఏమి చేయడు; తండ్రి చేస్తున్న దానిని చూసి కుమారుడు చేస్తాడు, ఎందుకంటే తండ్రి ఏం చేస్తే కుమారుడు అదే చేస్తాడు.


“ ‘ప్రభువా, నేను ఏమి చేయాలి?’ అని అడిగాను. “అప్పుడు ‘నీవు లేచి, దమస్కు పట్టణంలోనికి వెళ్లు, అక్కడ నీవు ఏమి చేయాలని నేను నిర్ణయించానో నీకు తెలియజేస్తాను’ అని చెప్పాడు.


మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. దానికి మేమే సాక్షులం.


నీవు లేచి పట్టణంలోనికి వెళ్లు, నీవు అక్కడ ఏమి చేయాలో నీకు తెలుస్తుంది” అన్నది.


పౌలు అనే, క్రీస్తు యేసు దాసుడనైన నేను, అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కొరకు ప్రత్యేకపరచబడ్డాను.


మీరు మీ నోటితో, “యేసు ప్రభువు” అని ఒప్పుకొని ప్రకటించి మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు.


ఈ కారణంగానే, క్రీస్తు తాను మరణించినవారికి జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉండడానికి ఆయన మరణించి తిరిగి సజీవంగా లేచారు.


దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసుని అపొస్తలునిగా ఉండడానికి పిలువబడిన పౌలు, మన సహోదరుడైన సొస్తెనేసు,


పౌలు, దేవుని చిత్తం బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడు మన సోదరుడు తిమోతి, కొరింథీలోని దేవుని సంఘానికి, అకయ ప్రాంతమంతటిలోని దేవుని పరిశుద్ధులందరికి కలిపి వ్రాయునది:


కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు,


అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్న వారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్ళలేదు, కాని నేను అరేబియాకు వెళ్ళాను. తరువాత దమస్కుకు తిరిగి వచ్చాను.


ప్రభువు ప్రజలలో నేను అత్యంత అల్పున్ని కానీ లెక్కించలేని ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో ఉన్నాయని యూదేతరులకు ప్రకటించడానికి దేవుడు తన దయతో నన్ను ఏర్పరచుకొన్నారు.


క్రీస్తుయేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానాన్ని అనుసరించి దేవుని చిత్తప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు అనే నేను,


ఆ నిత్యజీవం గురించి అబద్ధమాడని దేవుడు సృష్టి ఆరంభానికి ముందే వాగ్దానం చేశాడు.


నిత్య నిబంధన యొక్క రక్తం ద్వారా గొర్రెల గొప్ప కాపరియైన, ప్రభువైన యేసును మృతులలో నుండి తిరిగి వెనక్కి తెచ్చిన సమాధానకర్తయైన దేవుడు,


మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.


జీవించు వాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడు, ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా అధికారంలోనే ఉన్నాయి.


నమ్మకమైన సాక్షిగా, మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి, భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక! ఆయనే మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి,


“స్ముర్నలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: మొదటి వాడును చివరి వాడునై మరణించి తిరిగి లేచినవాడు ఈ మాటలు చెప్తున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ