Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎఫెసీయులకు 2:3 - తెలుగు సమకాలీన అనువాదము

3 మనమందరం కూడా ఒకప్పుడు లోకస్థులతో కలిసి జీవిస్తూ శరీరేచ్ఛలను మనస్సులోని కోరికలను నెరవేర్చుకొంటూ, ఇతరుల్లా మన శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండేవారం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించిమునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్నవాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 మనమందరం కూడా ఒకప్పుడు లోకస్థులతో కలిసి జీవిస్తూ శరీరేచ్ఛలను మనస్సులోని కోరికలను నెరవేర్చుకొంటూ, ఇతరుల్లా మన శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండేవారము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 మనమందరం కూడా ఒకప్పుడు లోకస్థులతో కలిసి జీవిస్తూ శరీరేచ్ఛలను మనస్సులోని కోరికలను నెరవేర్చుకొంటూ, ఇతరుల్లా మన శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండేవారము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎఫెసీయులకు 2:3
54 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాని తమ జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ధనమోసం మరియు ఇతర కోరికలు ఆ వాక్యాన్ని అణిచివేసి, ఫలించకుండా చేస్తాయి.


ఈ పిల్లలు శరీర కోరికల వలన, లేక మానవుల నిర్ణయాల వలన లేక భర్త కోరిక వలన పుట్టలేదు, కాని దేవుని మూలంగా పుట్టారు.


మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కనుక మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కనుక వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు, వాడు తన స్వభాషలో మాట్లాడతాడు, ఎందుకంటే వాడు అబద్ధికుడు మరియు అబద్ధాలకు తండ్రి.


గతంలో, ఆయన అన్ని దేశాల ప్రజలను తమ సొంత మార్గాలలో వెళ్లనిచ్చాడు.


కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు వదిలేసారు.


గతంలో దేవునికి అవిధేయులుగా ఉండి, వారి అవిధేయత ఫలితంగా దేవుని కృపను పొందారు.


అయితే, మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తృప్తిపరచాలని ఆలోచించకండి.


ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వతహాగా ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులు చేస్తే, వారు ధర్మశాస్త్రం లేనివారైనప్పటికీ, తమకు తామే ధర్మశాస్త్రంగా ఉన్నారు.


ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడ్డాం. మనము ఈ సమాధానాన్ని పొందినవారిగా ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాం.


ఇప్పుడైతే మనం ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడియున్నాం, అలాంటప్పుడు మనం ఇంకెంతగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం!


కనుక మీ శరీర దుష్ట ఆశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి.


నాకున్న పాప స్వభావాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కనుక, నేను మంచిని జరిగించాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను నెరవేర్చలేకపోతున్నాను.


దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి ఏర్పరచుకొన్నప్పటికి, నాశనం కొరకు సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి?


ఇతరులకంటే నిన్ను ప్రత్యేకంగా చేసేది ఎవరు? నీవు పొందుకోనిది నీ దగ్గర ఏమి ఉంది? నీవు పొందివుంటే, పొందని వానిలాగా గొప్పలు చెప్పుకోవడం ఎందుకు?


ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగివున్నాం కనుక, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాం.


అయితే వాగ్దానం చేయబడినది, యేసుక్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా, ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, పాప వశంలో ఉన్న వాటన్నిటినీ లేఖనం బంధించింది.


మీరు వీటిలో జీవిస్తున్నప్పుడు ఈ లోక మార్గాలను, అవిధేయులైన వారిలో ఇప్పుడు పని చేస్తున్న ఆత్మ అయిన వాయుమండల అధిపతిని అనుసరించేవారు.


మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి,


ఒకప్పుడు మీరు దేవుని నుండి దూరం అయ్యారు, మీ దుష్ట ప్రవర్తన వలన మీ మనస్సులో విరోధులయ్యారు.


సహోదరీ సహోదరులారా, చనిపోయినవారి గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మీరు నిరీక్షణ లేని ఇతరుల్లా దుఃఖించకండి.


కనుక మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాం.


అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకొనే వారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు.


ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాం. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము.


మీరు విధేయత కలిగిన బిడ్డలు కనుక, అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు గల చెడ్డకోరికలకు అనుగుణంగా ఉండకండి.


వ్యభిచారం నిండిన కళ్ళతో, పాపం చేయడం వారెప్పటికి మానరు; వారు అస్థిరత కలుగచేస్తారు; దురాశలో నేర్పుకలిగినవారు, శాపగ్రస్థులైన పిల్లలు!


ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు గలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకొన్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు.


ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం, ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి.


అయినా నేను ఒక క్రొత్త ఆజ్ఞ వ్రాస్తున్నాను; చీకటి గతించిపోతుంది, ఇప్పటికే నిజమైన వెలుగు ప్రకాశిస్తున్నది కనుక దాని సత్యం ఆయనలో మీలో కూడ కనిపిస్తూ ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ