Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎఫెసీయులకు 1:17 - తెలుగు సమకాలీన అనువాదము

17 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం మరియు ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17-19 మరియు మీ మనోనేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 నేను ఎల్లప్పుడు మన క్రీస్తు ప్రభువు యొక్క దేవుడు అయిన ఆ మహిమగల తండ్రి మీకు పరిశుద్ధాత్మను యివ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ మీకు జ్ఞానాన్నిచ్చి, దేవుణ్ణి తెలియజేయాలని నా అభిలాష. అప్పుడు మీరు దేవుణ్ణి యింకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎఫెసీయులకు 1:17
56 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ సమయంలో యేసు ఇలా అన్నారు, “తండ్రీ, భూమి ఆకాశములకు ప్రభువా, నీవు ఈ సంగతులను జ్ఞానులకు, తెలివైనవారికి మరుగుచేసి, చిన్నపిల్లలకు బయలుపరిచావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను.


“నా తండ్రి నాకు సమస్తం అప్పగించారు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు; అలాగే తండ్రి ఎవరో కుమారునికి, కుమారుడు ఎవరికి తెలియజేయాలని అనుకున్నారో వారికి తప్ప మరి ఎవరికి తెలియదు.


అందుకు యేసు, “యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములున్న వారి ద్వారా నీకు తెలియపరచబడలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేసారు.


వారు “ప్రభువా, మాకు చూపు కావాలి!” అని అన్నారు.


మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’


ఎందుకంటే మీరు ఏమి చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు.”


“అత్యున్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక.”


ఎందుకంటే మీ విరోధులు ఎదిరించడానికి గాని, నిరాకరించడానికి గాని వీలుకాని మాటలను మరియు జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను.


ఆయన సత్యమైన ఆత్మ. ఈ లోకం ఆయనను చూడలేదు తెలుసుకోలేదు, కనుక ఆయనను అంగీకరించదు. కానీ మీకు ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన మీలో జీవిస్తున్నాడు మరియు మీలో ఉంటాడు.


కానీ నా పేరిట తండ్రి పంపించు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటినన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాడు.


వారు నన్ను గాని, తండ్రిని గాని తెలుసుకోలేదు కనుక వారు ఇలాంటి పనులను చేస్తారు.


నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.


యేసు, “నేను తండ్రి దగ్గరకు ఇంకా ఆరోహణమవ్వలేదు, కనుక నన్ను ముట్టుకోవద్దు. దాని బదులు నా సహోదరుల దగ్గరకు వెళ్లి వారితో, ‘నా తండ్రియు నీ తండ్రియు మరియు నా దేవుడు నీ దేవుడు అయిన వాని దగ్గరకు ఎక్కి వెళ్తున్నాను’ అని వారితో చెప్పు” అన్నారు.


కాని ఆత్మ అనుగ్రహించిన జ్ఞానంతో మాట్లాడుతున్న స్తెఫనుకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేకపోయారు.


అందుకు అతడు, “సహోదరులారా మరియు తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై,


అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగివుండడం విలువైనదిగా భావించలేదు, కనుక వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు.


మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగివున్న మనోవైఖరి మనం ఒకరి పట్ల ఒకరం కలిగివుండేలా మనకు అనుగ్రహించును గాక.


ఒకరికి ఆత్మ ద్వారా జ్ఞాన సందేశం ఇవ్వబడింది, అదే ఆత్మ ద్వారా మరొకరికి విజ్ఞత సందేశం ఇవ్వబడింది.


కనుక సహోదరీ సహోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి ప్రత్యక్షతను లేదా జ్ఞానం లేదా ప్రవచనం లేదా వాక్య బోధ మీకు చెప్పకపోతే నేను వచ్చి భాషలలో మాట్లాడడం వల్ల నా నుండి మీకు ఏ మంచి జరుగుతుంది?


ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేసారు. ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది.


దీని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసివుంటే వారు మహిమా స్వరూపియైన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు.


నేను గర్వపడవచ్చు గాని, దాని వలన నాకు ప్రయోజనం లేదు. ప్రభువు దర్శనాల గురించి, ప్రత్యక్షతల గురించి చెప్తాను.


మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. పరలోక మండలాల్లో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో క్రీస్తులో ఆయన మనలను దీవించారు.


ఈ మర్మం, ఆత్మ వలన ఇప్పుడు దేవుని పరిశుద్ధ అపొస్తలులకు ప్రవక్తలకు తెలియపరచబడినట్లుగా ఇతర తరాలలోని వారికి తెలియపరచబడలేదు.


కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాం. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు.


దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.


దేవుడు ఎన్నుకొన్నవారి విశ్వాసాన్ని, నిత్యజీవం గురించిన నిరీక్షణలో ఉండే దైవభక్తిలోనికి నడిపించే, వారి సత్యజ్ఞానాన్ని బలపరచడానికి,


నా సహోదరీ సహోదరులారా, పక్షపాతం కలిగిన మీ పనులతో మహిమ గల మన ప్రభువైన యేసుక్రీస్తులో మీరు నిజంగా విశ్వాసం కలిగివున్నారా?


తన సొంత మహిమ వలన మంచితనం వలన మనల్ని పిలిచినవాని గురించి మనకున్న జ్ఞానం ద్వారా ఆయన యొక్క దైవశక్తి, దైవిక జీవితాన్ని జీవించడానికి మనకు కావలసిన ప్రతిదానిని మనకు ఇస్తుంది.


అయితే, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అనుగ్రహం జ్ఞానంలో వర్ధిల్లండి. ఆయనకు ఇప్పుడు ఎల్లప్పుడు మహిమ కలుగును గాక! ఆమేన్.


ఇలా అన్నారు: “ఆమేన్! మా దేవునికి స్తోత్రం, మహిమ, జ్ఞానం, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, శక్తి ప్రభావం నిరంతరం కలుగును గాక. ఆమేన్!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ