Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కొలొస్సయులకు 3:15 - తెలుగు సమకాలీన అనువాదము

15 ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కొరకు మీరు పిలువబడ్డారు, కనుక క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 క్రీస్తు కలుగచేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. కృతజ్ఞతతో ఉండండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కొలొస్సయులకు 3:15
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా సమాధానాన్ని మీతో వదిలి వెళ్తున్నాను; నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఈ లోకం ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు మీ హృదయాలను కలవరపడనీయకండి, భయపడకండి.


“ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను” అన్నారు.


వారు దేవుణ్ణి ఎరిగినప్పటికీ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, కాని వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి వారి మూర్ఖపు హృదయాలు చీకటిమయం అయ్యాయి.


దేవుని రాజ్యం తిని త్రాగే వాటికి సంబంధించింది కాదు గాని, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందానికి సంబంధించింది.


పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగివుండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.


మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగివున్నాము.


మనమందరం ఆ ఒకే రొట్టెను పంచుకుంటున్నాం, రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనం ఒకే శరీరంగా ఉన్నాం.


అయితే అవిశ్వాసి విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. అలాంటి సందర్భాలలో ఉన్న విశ్వాసులైన సహోదరుడు లేదా సహోదరి కట్టుబడి ఉండనవసరం లేదు; సమాధానం కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు.


ఇదంతా మీ మేలు కోసమే, అప్పుడు దేవుని కృప అధికంగా వ్యాపించి ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.


మీరు ప్రతి సమయంలో ఉదారంగా ఇవ్వడానికి మీరు అన్నిరకాలుగా సంపన్నులు అవుతారు, మీ దాతృత్వం బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయి.


ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోవున్న ప్రతీ అవయవం దాని పనిని చేస్తుండగా, ప్రతి కీలు సహాయంతో ఒకటిగా అతుకబడి ప్రేమలో తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని వృద్ధి చేసుకుంటుంది.


శరీరం ఒక్కటే; ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీరు పిలువబడినప్పుడు ఒకే నిరీక్షణ కొరకు పిలువబడ్డారు;


కావున, మీరు దేవుని ప్రియ పిల్లల్లా ఆయనను పోలి నడుచుకోండి.


ఎల్లప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మన తండ్రియైన దేవునికి అన్నిటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.


వెలుగు రాజ్యంలో పరిశుద్ధ ప్రజల స్వాస్థ్యంలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని ఎన్నికచేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.


మీకు బోధించబడిన ప్రకారం విశ్వాసంలో స్థిరపడుతూ, మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఆయనలో మీరు జీవించడం కొనసాగించండి.


మీరు మాటలలో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.


మీరు ప్రతి విషయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశం.


అన్నిటికంటే ప్రాముఖ్యంగా, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, అందరి పక్షంగా అనగా రాజుల కొరకు అధికారంలో ఉన్న వారందరి కొరకు దేవునికి విన్నపాలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసి కృతజ్ఞతలు చెల్లిస్తే, మనం పూర్ణ భక్తి, పరిశుద్ధత కలిగి శాంతి సమాధానాలతో ప్రశాంతంగా జీవించగలం.


విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం యెదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.


కాబట్టి, యేసు ద్వారా, ఆయన పేరును బహిరంగంగా ఒప్పుకొనే పెదవులఫలంతో మనం నిరంతరం దేవునికి స్తుతి బలిని అర్పిద్దాం.


ఇలా అన్నారు: “ఆమేన్! మా దేవునికి స్తోత్రం, మహిమ, జ్ఞానం, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, శక్తి ప్రభావం నిరంతరం కలుగును గాక. ఆమేన్!”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ