Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కొలొస్సయులకు 3:10 - తెలుగు సమకాలీన అనువాదము

10 మరియు సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కొలొస్సయులకు 3:10
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.


ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.


రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కనుక మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాం.


అయితే, మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తృప్తిపరచాలని ఆలోచించకండి.


తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతోపాటు పాతిపెట్టబడ్డాము.


అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు.


కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మ అయిన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.


కనుకనే, మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము.


“చీకటి నుండి వెలుగు కలుగును గాక” అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింజేసారు.


అందుకే, ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతది గతించిపోయింది, క్రొత్తది ఇక్కడ ఉంది!


క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని యున్నారు.


సున్నతి పొందడంలో సున్నతి పొందకపోవడంలో అర్థమేమి లేదు, నూతన సృష్టి మాత్రమే లెక్కించబడుతుంది.


ఎందుకంటే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై యున్నాము.


అదెలాగంటే, యేసు క్రీస్తు తన శరీరంలో మోషే ఇచ్చిన ధర్మశాస్రంలోని ఆజ్ఞలను నియమాలను కొట్టివేసారు. ఆయన ఉద్దేశమేమంటే ఈ ఇద్దరిని కలిపి తనలో ఒక నూతన మానవత్వాన్ని సృజించడం, ఆ విధంగా సమాధానపరచడం.


కనుక, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు, ప్రియమైన వారిలా, మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.


వాటన్నిటిని ఒక్కటిగా సంపూర్ణ ఐక్యతలోనికి తీసుకువచ్చే ప్రేమను వీటన్నింటి కంటే పైగా ధరించుకోండి.


క్రీస్తు కొరకు మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో జతపనివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.


తప్పిపోయినవారిని తిరిగి పశ్చాత్తాపం వైపుకు నడిపించడం అసాధ్యం. అలాంటివారు తమ నాశనానికే దేవుని కుమారుని మళ్ళీ సిలువవేస్తూ, ఆయనను బహిరంగంగా అవమానానికి గురిచేస్తున్నారు.


ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనం తెలుసుకుంటాము.


అయితే ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో, వారిలో దేవుని పట్ల ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. మనం ఆయనలో ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాము.


అప్పుడు సింహాసనం మీద కూర్చునివున్న దేవుడు, “ఇదిగో, సమస్తాన్ని నూతనపరుస్తున్నాను” అని చెప్పి, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి కనుక వీటిని వ్రాసి పెట్టు” అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ