ప్రవక్తయైన యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా: “ ‘ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కొరకు త్రోవలను సరిచేయండి. ప్రతి లోయ పూడ్చబడుతుంది, ప్రతి పర్వతం, కొండ పల్లంగా చేయబడుతుంది. వంకర త్రోవలు తిన్ననివవుతాయి, గరుకు మార్గాలు నునుపు అవుతాయి. అందరు దేవుని రక్షణను చూస్తారు,’ అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం.”
అతడు బయలుదేరి వెళ్తునప్పుడు, ఆ మార్గంలో ఐతియొపీయుల రాణి అయిన కందాకే యొక్క ధనాగారం అంతటికి ముఖ్య అధికారిగా ఉన్న ఐతియొపీయుడైన నపుంసకుని కలుసుకున్నాడు. ఇతడు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాడు,
సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి.