Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 25:23 - తెలుగు సమకాలీన అనువాదము

23 మరుసటిరోజు అగ్రిప్ప రాజు అతని భార్య బెర్నీకే గొప్ప ఆడంబరంగా, ఉన్నత సైనికాధికారులతో పట్టణ ప్రముఖులతో కలిసి ప్రేక్షకుల గదిలోనికి ప్రవేశించారు. ఫేస్తు ఆజ్ఞతో పౌలును లోపలికి తీసుకొని వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణ మందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 మరునాడు అగ్రిప్ప, బెర్నీకే ఎంతో ఆడంబరంగా వచ్చి, సైనికాధిపతులతో, పురప్రముఖులతో అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞపై పౌలును తీసుకువచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే మిక్కిలి ఆడంబరంగా సభలోకి వచ్చి సహస్రాధిపతులతో, పట్టణ ప్రముఖులతో కలిసి కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించగానే పౌలు సభలోకి తేబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 మరుసటిరోజు అగ్రిప్ప రాజు అతని భార్య బెర్నీకే గొప్ప ఆడంబరంగా, ఉన్నత సైనికాధికారులతో పట్టణ ప్రముఖులతో కలిసి ప్రేక్షకుల గది లోనికి ప్రవేశించారు. ఫేస్తు ఆజ్ఞతో పౌలును లోపలికి తీసుకుని వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 మరుసటిరోజు అగ్రిప్ప రాజు అతని భార్య బెర్నీకే గొప్ప ఆడంబరంగా, ఉన్నత సైనికాధికారులతో పట్టణ ప్రముఖులతో కలిసి ప్రేక్షకుల గది లోనికి ప్రవేశించారు. ఫేస్తు ఆజ్ఞతో పౌలును లోపలికి తీసుకుని వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 25:23
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

చివరికి సరియైన సమయం రానే వచ్చింది. హేరోదు తన జన్మదినం సందర్భంగా తన ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ ప్రాంత ప్రముఖులకు విందు ఇచ్చాడు.


నిర్ణయించబడిన రోజున హేరోదు, రాజ వస్త్రాలను ధరించుకొని, తన సింహాసనం మీద కూర్చుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు.


కొన్ని రోజుల తర్వాత రాజైన అగ్రిప్ప అతని భార్య బెర్నీకేతో ఫేస్తును దర్శించడానికి కైసరయకు వచ్చారు.


అగ్రిప్ప రాజు లేచాడు, అతనితో పాటు ఫేస్తు, బెర్నీకే మరియు వారితో కూర్చున్న వారందరు లేచారు.


అయితే ప్రభువు అననీయతో, “వెళ్లు! ఇతడు ఇశ్రాయేలీయులకు మరియు యూదేతరులకు మరియు వారి రాజులకు నా నామంను ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనం.


ఈ లోక విషయాలను ఉపయోగించేవారు వాటిలో మునిగిపోనివారిలా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం ఉన్న ప్రస్తుత రూపం గతించిపోతుంది.


కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు.


ఎందుకనగా, “మానవులందరు గడ్డి వంటివారు, వారి వైభవం గడ్డి పువ్వు వంటిది; గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి,


ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం, ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ