అపొస్తలుల 20:31 - తెలుగు సమకాలీన అనువాదము31 కనుక మీరు మెలకువగా ఉండండి! నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎలా కన్నీరు కార్చుతూ మీలో ప్రతి ఒక్కరిని మానకుండా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతిమనుష్యునికి మానక బుద్ధిచెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్31 అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను మూడు సంవత్సరాలు మీతో ఉన్నాను. కంటతడి పెట్టుకొని రాత్రింబగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కర్నీ వారించాను. ఈ విషయం మరిచిపోకండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 కాబట్టి మీరు మెలకువగా ఉండండి! నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎలా కన్నీరు కార్చుతూ మీలో అందరిని మానకుండా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 కాబట్టి మీరు మెలకువగా ఉండండి! నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎలా కన్నీరు కార్చుతూ మీలో అందరిని మానకుండా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి. အခန်းကိုကြည့်ပါ။ |
మీ నాయకులపై నమ్మకం కలిగి ఉండండి, వారి అధికారానికి లొంగి ఉండండి, ఎందుకంటే వారు మీ గురించి తప్పక లెక్క అప్పగించాల్సినవారిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వారు తమ పనిని భారంగా భావించి చేస్తే అది మీకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు; కనుక వారు చేయవలసిన పనిని భారంగా కాకుండా ఆనందంగా చేసేలా మీరు వారికి లోబడి ఉండండి.