Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 2:32 - తెలుగు సమకాలీన అనువాదము

32 దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

32 ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 “ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

32 కావున దేవుడు ఈ యేసునే మృత్యువునుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

32 దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

32 దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 2:32
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు మొదటి నుండి నాతో ఉన్నవారే, కనుక మీరు కూడ తప్పక నా గురించి సాక్ష్యం ఇవ్వాలి.


ఆయన పరలోకానికి వెళ్లిన రోజు వరకు మనతో ఉన్నవారిలో ఒకనిని ఏర్పరచుకోవడం అవసరం. వీరిలో ఒకడు మనతో కలిసి ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి” అన్నాడు.


అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొంటారు. అప్పుడు మీరు యెరూషలేములో, సమస్త యూదయ, సమరయ ప్రాంతాలలో, భూమి అంచుల వరకు నాకు సాక్షులుగా ఉంటారు” అన్నారు.


కానీ దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు.


యేసును మరణం నుండి లేపడం ద్వారా ఆయన పిల్లలంగా ఉన్న మనకొరకు నెరవేర్చారు. రెండవ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.’


ఎందుకనగా, లోకమంతటికి ఆయన నియమించిన వ్యక్తి ద్వారా నీతితో తీర్పు తీర్చడానికి ఆయన ఒక రోజును నిర్ణయించాడు. దేవుడు ఆయనను మరణం నుండి సజీవంగా లేపి ప్రతి ఒక్కరికి దీనిని రుజువుపరిచాడు.”


కానీ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం, కనుక దేవుడు ఆయనను మరణ వేదన నుండి విడిపించి, మృతులలో నుండి లేపారు.


మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. దానికి మేమే సాక్షులం.


దేవుడు తన సేవకుని లేపినప్పుడు, మీలో ప్రతి ఒక్కరిని దుష్ట మార్గాల నుండి తప్పించి మిమ్మల్ని దీవించడానికి ఆయనను మొదట మీ దగ్గరకు పంపించారు.”


మీరు మరియు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేసారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామంను బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు.


అపొస్తలులు గొప్ప శక్తితో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యమివ్వడం కొనసాగించారు. వారందరిలో దేవుని కృప ఎంతో శక్తివంతంగా పనిచేస్తూవున్నది.


మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు.


అంతకంటే ఎక్కువ, దేవుని విషయంలో అనగా దేవుడు క్రీస్తును మరణం నుండి లేపారని చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము తప్పుడు సాక్షులంగా కనిపిస్తాం. అయితే దేవుడు ఆయనను లేపకపోతే మరణించినవారు లేపబడరు అనేది నిజం కదా.


దేవుడు తన శక్తి వలన ప్రభువును మరణం నుండి సజీవంగా లేపాడు. కనుక ఆయన మనల్ని కూడ అలాగే సజీవంగా లేపుతాడు.


ఎందుకంటే, ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన దేవుడు, యేసుతోపాటు మమ్మల్ని కూడా లేవనెత్తి మీతో పాటు మమ్మల్ని తన యెదుట నిలబెడతాడని మాకు తెలుసు.


పౌలు, అనే నేను మనుష్యుల నుండి గాని లేక ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను.


పరిమితమైన ప్రభావం గల ఆ శక్తితోనే ఆయన క్రీస్తును తిరిగి బ్రతికించి, సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగంలో రాబోవు యుగాలలో పేరుగాంచిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకంలోని తన కుడి వైపున ఆయనను కూర్చోబెట్టుకున్నారు.


ఏ విధంగా అంటే, బాప్తిస్మంలో మీరు ఆయనతోపాటు పాతిపెట్టబడి, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని క్రియలను మీరు విశ్వసించుట ద్వారా ఆయనతోపాటు మీరు కూడా మృతులలో నుండి లేచారు.


నిత్య నిబంధన యొక్క రక్తం ద్వారా గొర్రెల గొప్ప కాపరియైన, ప్రభువైన యేసును మృతులలో నుండి తిరిగి వెనక్కి తెచ్చిన సమాధానకర్తయైన దేవుడు,


మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ