Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 11:3 - తెలుగు సమకాలీన అనువాదము

3 “నీవు సున్నతి పొందని వారి ఇంటికి వెళ్లి వారితో భోజనం చేసావు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 –నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనముచేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 “నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 “నీవు సున్నతి చేసుకోనివాళ్ళ యిళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి తిన్నావు!” అని అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 “నీవు సున్నతి పొందని వారి ఇంటికి వెళ్లి వారితో భోజనం చేశావు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 “నీవు సున్నతి పొందని వారి ఇంటికి వెళ్లి వారితో భోజనం చేశావు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 11:3
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇది చూసిన పరిసయ్యులు, “మీ బోధకుడు పన్ను వసూలు చేసేవారితో, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు.


అయితే పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు అది చూసి, “ఇతడు పాపులతో కూర్చుని వారితో కలిసి తింటున్నాడు” అని సణుగుకొన్నారు.


అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప వద్దనుంచి రోమా అధిపతి భవనానికి తీసుకువెళ్ళారు, అప్పటికి తెల్లవారింది కనుక అపవిత్రపడకుండా పస్కాను తినాలని వారు భవనంలోనికి వెళ్లలేదు.


అప్పుడు పేతురు వారిని తన అతిథులుగా ఇంట్లోకి ఆహ్వానించాడు. మరుసటిరోజు పేతురు వారితో కలిసి బయలుదేరాడు, వారితో పాటు యొప్పేలో ఉన్న కొందరు విశ్వాసులు కూడా వెళ్లారు.


అతడు వారితో, “మీ అందరికి తెలిసినట్లే ఒక యూదుడు, యూదుడుకాని వ్యక్తితో సాంగత్యం చేయడం, వారిని కలవడం, యూదా నియమానికి విరుద్ధం. అయితే ఎవరినీ నేను అపవిత్రులని గాని నిషేదించబడిన వారని గాని పిలువకూడదని దేవుడు నాకు చూపించాడు.


నీవు యొప్పే పట్టణంలో ఉన్న పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో అతిథిగా ఉన్నాడు’ అని నాతో చెప్పాడు.


కనుక వారు యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందాలని పేతురు ఆదేశించాడు. ఆ తర్వాత వారు పేతురును తమతో మరికొన్ని రోజులు ఉండుమని బ్రతిమాలుకొన్నారు.


ఇప్పుడైతే, సహోదరి లేదా సహోదరుడని పిలువబడే సంఘసభ్యుల గురించి వ్రాస్తున్నాను. ఎవరైనా, వ్యభిచారిగా, అత్యాశపరునిగా, విగ్రహారాధికునిగా లేదా నిందలువేసే వారిగా, త్రాగుబోతుగా లేదా మోసగానిగా ఉంటే అలాంటి వారితో కలిసి ఉండవద్దు. అలాంటి వారితో భోజనం కూడా చేయవద్దని మీకు వ్రాస్తున్నాను.


ఎలాగంటే, యాకోబు దగ్గరి నుండి కొందరు మనుష్యులు రాకమునుపు, అతడు యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. కాని వారు వచ్చినప్పుడు, అతడు వెనక్కి తగ్గి యూదేతరుల నుండి ప్రక్కకు వెళ్లాడు ఎందుకంటే అతడు సున్నతి చేయబడిన వారికి భయపడ్డాడు.


ఎవరైన ఈ బోధను తీసుకురాకుండా మీ దగ్గరకు వస్తే, వారిని మీ ఇంట్లోకి తీసుకువెళ్ళవద్దు లేదా రమ్మనవద్దు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ