Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 11:27 - తెలుగు సమకాలీన అనువాదము

27 ఆ రోజులలో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

27 ఆ రోజుల్లో కొంత మంది ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 ఆ రోజుల్లో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 ఆ రోజుల్లో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 11:27
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకే నేను మీ దగ్గరకు ప్రవక్తలను, జ్ఞానులను, బోధకులను పంపిస్తున్నాను. వారిలో కొందరిని మీరు చంపి సిలువ వేస్తారు; ఇంకొందరిని ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి తరిమి మీ సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టిస్తారు.


ఇందుకే, దేవుడు మీ గురించి తన జ్ఞానంలో, ‘నేను వారికి ప్రవక్తలను, అపొస్తలులను పంపుతాను, వారిలో కొందరిని వారు చంపుతారు, మరికొందరిని హింసిస్తారు.’


వారిలో కుప్ర మరియు కురేనీకు చెందిన కొందరు అంతియొకయ పట్టణానికి వెళ్లి గ్రీకు దేశస్థులతో కూడా ప్రభువైన యేసు సువార్తను చెప్పడం మొదలుపెట్టారు.


ఈ సమాచారం యెరూషలేములో ఉన్న సంఘానికి చేరినప్పుడు వారు బర్నబాను అంతియొకయ ప్రాంతానికి పంపించారు.


అంతియొకయ సంఘంలో ప్రవక్తలు మరియు బోధకులు ఉన్నారు. వారిలో కొందరు: బర్నబా, నీగెర అనబడే సుమెయోను, కురేనీకి చెందిన లూకియ, చతుర్ధాధిపతి హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు.


అత్తాలియ పట్టణం నుండి బయలుదేరి ఓడ ఎక్కి తాము ఇంతవరకు పూర్తి చేసిన పనిని దేవుని కృపకు అప్పగించి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చారు.


ఆ తర్వాత అపొస్తలులు మరియు సంఘపెద్దలు సంఘమంతటితో కలిసి, పౌలు బర్నబాలతో పాటు ఇంకొందరు విశ్వాసులను అంతియొకయ ప్రాంతానికి పంపాలని నిర్ణయించి విశ్వాసుల మధ్యలో నాయకులుగా ఉన్న బర్సబ్బా అని పిలువబడే యూదా మరియు సీలను ఏర్పరచుకున్నారు.


వారు పంపబడిన తర్వాత వారు అక్కడి నుండి బయలుదేరి అంతియొకయ పట్టణానికి వచ్చి, అక్కడ సంఘమంతటిని ఒక్క చోటికి చేర్చి ఈ ఉత్తరాన్ని వారికి అందించారు.


యూదా, సీలలు కూడా ప్రవక్తలు కనుక వారు కూడా విశ్వాసులను ప్రోత్సహించి వారిని విశ్వాసంలో బలపరిచారు.


అతడు కైసరయ తీరాన దిగి, యెరూషలేముకు వెళ్లి సంఘాన్ని పలకరించాడు మళ్ళీ అక్కడి నుండి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చాడు.


“ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజులలో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనస్థులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు.


కనుక మేము అక్కడి శిష్యులను కలిసి వారితో ఏడు రోజులు ఉన్నాము. నీవు యెరూషలేముకు వెళ్లవద్దని ఆత్మ ద్వారా వారు పౌలును బ్రతిమలాడారు.


అతనికి ప్రవచన వరం కలిగిన వివాహం కాని నలుగురు కుమార్తెలున్నారు.


ఈ ఆలోచన అందరికి నచ్చింది. కనుక వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండిన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదా మతంలోనికి మారిన అంతియొకయ నివాసి అయిన నికోలాసు అనే వారిని ఏర్పరచుకున్నారు.


ఆత్మ ఒకరికి అద్బుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు.


మరియు దేవుడు తన సంఘంలో మొదటిగా అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో బోధకులను, ఆ తరువాత అద్బుతాలు చేసేవారిని, ఆ తరువాత స్వస్థత వరాన్ని కలిగినవారిని, సహాయం చేసేవారిని, మార్గదర్శకం చేసేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించారు.


ప్రవక్తల యొక్క ఆత్మ ప్రవక్తలకు లోబడి ఉండాలి.


కేఫా అనే పేతురు అంతియొకయకు వచ్చినపుడు, అతడు తప్పు చేశాడు కనుక నేను అతన్ని ముఖాముఖిగా ఎదిరించాను.


మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడునట్లు తన ప్రజలను పరిచర్య కొరకు సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ