Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 థెస్సలొనీకయులకు 2:8 - తెలుగు సమకాలీన అనువాదము

8 ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 అప్పుడు ఆ భ్రష్టుడు కనిపిస్తాడు. యేసు ప్రభువు వాణ్ణి తన ఊపిరితో హతమారుస్తాడు. యేసు తేజోవంతంగా ప్రత్యక్షమై ఆ భ్రష్టుణ్ణి నాశనం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 థెస్సలొనీకయులకు 2:8
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

పరలోక రాజ్యాన్ని గురించి వాక్యాన్ని విని దానిని గ్రహించలేకపోతే, దుర్మార్గుడు వచ్చి వారి హృదయాల్లో విత్తబడిన దానిని ఎత్తుకుపోతాడు. వారు దారి ప్రక్కన పడిన విత్తనాలు.


పొలం అనేది ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించినవారు. కలుపుమొక్కలు దుష్టునికి సంబంధించినవారు.


ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.


“ఇక్కడ నిలబడివున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యంతో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.


ఎవరూ దేవుని ముందు తనను తాను హెచ్చించుకోకుండా ఉండడానికి, ఎన్నికచేయబడిన వారిని వ్యర్థం చేయడానికి, ఈ లోకంలో నీచమైన వారిని, నిర్లక్ష్యం చేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు.


మిమ్మల్ని ఎవరైనా ఏ రీతిగానైనా మోసపరచనివ్వకండి. ఎందుకంటే తిరుగుబాటు వచ్చేవరకు, నాశనానికి కర్తయైన దుర్మార్గుడు బయటపడే వరకు ఆ దినము రాదు.


నీవు మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి ప్రత్యక్షమయ్యే వరకు నిందగాని డాగుగాని లేకుండా ఈ ఆజ్ఞలకు లోబడు.


అయితే మరణాన్ని నాశనం చేసి, జీవాన్ని, నిత్యత్వాన్ని సువార్త ద్వారా వెలుగులోనికి తీసుకొనివచ్చిన మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షత వలన అది నేడు మనకు వెల్లడి చేయబడింది.


నేను దేవుని యెదుట, తాను వచ్చినప్పుడు తన రాజ్యంలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోయే యేసు క్రీస్తు యెదుట నీకు ఇచ్చే ఆజ్ఞ యిదే:


కనుక నీతిమంతుడు న్యాయాధిపతియైన ప్రభువు ఆ రోజున నాకు బహుమతిగా ఇవ్వబోయే నీతి కిరీటం నా కొరకు దాచబడివుంది. ఈ బహుమానం నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కొరకు ప్రేమతో ఎదురు చూస్తున్న వారందరికి అనుగ్రహిస్తారు.


స్వీయ నియంత్రణ కలిగి, ఈ ప్రస్తుత యుగంలో న్యాయంగా భక్తి కలిగి జీవించమని ఆ కృపయే మనకు బోధిస్తుంది.


అయితే తీర్పు కొరకు, దేవుని శత్రువులను దహించబోయే ప్రచండమైన అగ్ని కొరకు మాత్రమే భయంతో ఎదురుచూడటం మిగిలివుంటుంది.


తండ్రులారా, నేను మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే, ఆది నుండి ఉన్న వానిని మీరు ఎరుగుదురు. యవ్వనస్థులారా, నేను మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే, మీరు దుష్టుని జయించారు.


కయీను వలె ఉండవద్దు, అతడు దుష్టునికి చెందినవాడై తన సహోదరుని చంపాడు. అతడు తన సహోదరుని ఎందుకు చంపాడు? ఎందుకంటే అతడు చేసిన పనులు చెడ్డవి, అతని సహోదరుని పనులు నీతి గలవి.


దేవుని మూలంగా పుట్టిన వారెవరు పాపం కొనసాగించలేరని మనకు తెలుసు; దేవుని మూలంగా పుట్టిన వారు తమను తాము భద్రం చేసుకుంటారు, కనుక దుష్టుడు వారిని ముట్టలేడు.


ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొన్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.


ఆ మృగానికి దేవునికి విరుద్ధంగా తన గొప్పలు పలికి దైవదూషణ చేసే నోరు మరియు నలభై రెండు నెలల సమయం వరకు రాజ్యాలను ఏలడానికి అనుమతి ఇవ్వబడింది.


దేశాలను నరకడానికి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. “ఆయన ఒక ఇనుప దండంతో వారిని పరిపాలిస్తాడు.” ఆయన సర్వశక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత అనే మద్యపు తొట్టిని త్రొక్కుతాడు.


కనుక పశ్చాత్తాపపడు! లేకపోతే నేను త్వరలో నీ దగ్గరకు వచ్చినా నోటి ఖడ్గంతో వారితో యుద్ధం చేస్తాను.


అప్పుడు వారిని మోసగించిన సాతాను ఇంతకు ముందు ఆ మృగం, అబద్ధ ప్రవక్త పడవేయబడిన అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడతాడు. అక్కడ వారు నిరంతరం రాత్రింబగళ్లు వేధించబడతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ