Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 థెస్సలొనీకయులకు 1:4 - తెలుగు సమకాలీన అనువాదము

4 కనుక మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాలలో మేము గొప్పగా చెప్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్నశ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అందుకే మీరు పొందుతున్న హింసలన్నిటిలోనూ, మీరు సహిస్తున్న యాతనల్లోనూ, మీ సహనాన్నీ, విశ్వాసాన్నీ చూసి దేవుని సంఘాల్లో మీ గురించి మేమే గర్వంగా చెబుతున్నాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 మీరు ఓర్పుతో సహిస్తున్న హింసలను గురించి, కష్టాలను గురించి విశ్వాసాన్ని గురించి మేము పొగడుతూ దేవుని ఇతర సంఘాలకు చెపుతూ ఉంటాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 కాబట్టి మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాల్లో మేము గొప్పగా చెప్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 కాబట్టి మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాల్లో మేము గొప్పగా చెప్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 థెస్సలొనీకయులకు 1:4
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి.


ఎవరైతే పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమను, ఘనతను, నిత్యత్వాన్ని వెదకుతారో వారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు.


అయితే మన దగ్గర లేని దాని కొరకు మనం నిరీక్షిస్తే, మనం ఓపికగా ఎదురుచూడగలము.


ప్రభువు తమను ఏ స్థితి నుండి పిలిచాడో, ప్రతి ఒక్కరు ఆ స్థితిలోనే విశ్వాసిగా జీవించాలి. ఇదే నియమాన్ని అన్ని సంఘాలలో నియమిస్తున్నాను.


అందుకే, క్రీస్తు కొరకు, నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. ఎందుకంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.


మిమ్మల్ని అతని ముందు చాలా పొగిడాను, మీరు నన్ను సిగ్గుపరచలేదు, మీకు ఎప్పుడు నిజమే చెప్పాము. అలాగే తీతు ముందు మేము చేసిన పొగడ్తలు వాస్తవమైనవే అని నిరూపించబడ్డాయి.


ఎంతో నిష్కపటంగా నేను మీకు చెప్పాను; మీ గురించి నేను చాలా గర్వపడతాను. ఎంతో ధైర్యపరచబడతాను; మా శ్రమలన్నింటిలో నా ఆనందానికి హద్దులు లేవు.


సహాయం చేయడానికి మీరు ఆసక్తి గలవారని నాకు తెలుసు, అందుకే మాసిదోనియాలోని ప్రజలకు మీ గురించి గొప్పగా, అకయలో ఉన్న మీరు గత ఏడాది నుండి సహాయం చేయడానికి సిద్ధపడ్డారని వారికి చెప్పాను; మీ ఆసక్తి వారిలో అనేకమందిని ప్రేరేపించింది.


ఒకవేళ మాసిదోనియా వారెవరైనా నాతో వచ్చినపుడు మీరు సిద్ధంగా లేరని చూస్తే, మీ గురించి మేమేమి చెప్పలేము, మీ పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగివున్నందుకు సిగ్గుపడాల్సి ఉంటుంది.


దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసుక్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము.


సహోదరీ సహోదరులారా, మీరు క్రీస్తు యేసులో ఉన్న యూదయలోని దేవుని సంఘాల్లాగా నడుచుకోవడం మొదలుపెట్టారు: యూదుల వలన ఆ సంఘాలు శ్రమపడిన విధంగానే మీరు కూడా మీ సొంత ప్రజల నుండి శ్రమపడ్డారు.


మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన యెదుట మా నిరీక్షణ, ఆనందం, మా గౌరవ కిరీటం ఎవరు? అది మీరు కాదా?


ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.


దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు.


అంతేగాక, మీరు సోమరులుగా ఉండక, విశ్వాసం, ఓర్పు ద్వారా వాగ్దానం చేయబడినదానికి వారసులైన వారిని మీరు అనుకరించాలని మేము కోరుతున్నాం.


ఓర్పుతో వేచివున్న తరువాత, చేయబడిన వాగ్దానఫలాన్ని అబ్రాహాము పొందుకొన్నాడు.


సహనాన్ని చూపినవారిని ధన్యులు అని పిలుస్తాము. యోబుకు గల సహనం గురించి మీకు తెలుసు, ప్రభువు ఎంత జాలిని దయను కలిగినవాడో ఆయన ఉద్దేశాలలో మీరు తెలుసుకున్నారు.


వివేకానికి స్వీయ నియంత్రణ; స్వీయ నియంత్రణకు సహనాన్ని; సహనానికి దైవ భక్తిని;


అందుకే దేవుని ప్రజలు యేసుక్రీస్తుకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నవారు సహనంతో ఆ హింసలను భరించాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ