Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 పేతురు 2:14 - తెలుగు సమకాలీన అనువాదము

14 వ్యభిచారం నిండిన కళ్ళతో, పాపం చేయడం వారెప్పటికి మానరు; వారు అస్థిరత కలుగచేస్తారు; దురాశలో నేర్పుకలిగినవారు, శాపగ్రస్థులైన పిల్లలు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభత్వమందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాపగ్రస్తులునైయుండి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేని వారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారి హృదయాలు ఎప్పుడూ పేరాశతో సిద్ధంగా ఉంటాయి. వారు శాపానికి గురైన ప్రజలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 వాళ్ళు కళ్ళనిండా కామాన్ని నింపుకొని, పాపం చేయటం ఎన్నటికీ మానరు. వాళ్ళు మనస్సు స్థిరంలేనివాళ్ళను అడ్డదారి పట్టిస్తారు. దేవుని శాపానికి గురియైన వాళ్ళు, డబ్బు లాగటంలో నిపుణులు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 వ్యభిచారం నిండిన కళ్లతో, పాపం చేయడం వారెప్పటికి మానరు; వారు అస్థిరమైన వ్యక్తులను ప్రలోభపెడతారు; వారు దురాశ కోసం వారి హృదయాలకు శిక్షణనిచ్చారు; వీరు శాపగ్రస్తులైన పిల్లలు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 వ్యభిచారం నిండిన కళ్లతో, పాపం చేయడం వారెప్పటికి మానరు; వారు అస్థిరమైన వ్యక్తులను ప్రలోభపెడతారు; వారు దురాశ కోసం వారి హృదయాలకు శిక్షణనిచ్చారు; వీరు శాపగ్రస్తులైన పిల్లలు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 పేతురు 2:14
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

సర్పసంతానమా! మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలను ఎలా పలకగలరు? హృదయం దేనితో నిండివుందో దానినే నోరు మాట్లాడుతుంది.


వారు విధవరాళ్ళ గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు.]


“అప్పుడు ఆయన తన ఎడమ వైపున ఉన్న వారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి, అపవాది మరియు వాని దూతల కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్లిపొండి.


అయితే నేను మీతో చెప్పేది, ఒక స్త్రీని కామంతో చూసే ప్రతివాడు అప్పటికే తన మనస్సులో ఆమెతో వ్యభిచరించాడు.


ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఎన్నుకొన్న వారిని సహితం మోసం చేయడానికి సూచక క్రియలను, అద్బుతాలను చేస్తారు.


ఏకైక దేవుని నుండి వచ్చే కీర్తిని వెదకకుండా ఒకరి నుండి ఒకరికి వచ్చే కీర్తిని అంగీకరించే మీరు నన్ను ఎలా నమ్ముతారు?


ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ సొంత ఆకలినే తీర్చుకొంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు.


మీలో ఎవరు దేవుని ఆమోదం పొందారో తెలియడానికి మీ మధ్యలో భేదాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.


మనమందరం కూడా ఒకప్పుడు లోకస్థులతో కలిసి జీవిస్తూ శరీరేచ్ఛలను మనస్సులోని కోరికలను నెరవేర్చుకొంటూ, ఇతరుల్లా మన శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండేవారం.


కనుక, మనం ఇంకా పసిపిల్లలం కాదు కాబట్టి, మనుష్యులు మోసపూరిత యోచనలతో వంచనలతో కుయుక్తితో చేసే బోధలు అనే ప్రతీ గాలికి ఇటు అటు ఎగిరిపోతూ, అలలచే ముందుకు వెనుకకు కొట్టుకొనిపోయేవారంగా ఉండకూడదు.


అతివినయంలో ఆనందిస్తూ, దేవదూతలపట్ల భక్తి చూపే ఎవరైనా మిమ్మల్ని అనర్హులుగా చేయకుండా చూసుకోండి. అలాంటివారు తాము చూచిన వాటిని గురించి గొప్పగా వివరిస్తూ ఉంటారు; తమ బుద్ధిహీనమైన మనస్సు వలన వ్యర్థమైన ఆలోచనలతో అతిశయపడతారు.


అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగివుంటారు, తాము చేసే వాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు.


ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు గలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకొన్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు.


ఈ బోధకులు పేరాశ గలవారైవుండి, కట్టుకథలు చెప్పి మిమ్మల్ని దోచుకుంటారు, వారి తీర్పు వారి మీదికే వస్తుంది, వారి నాశనం ఆలస్యం కాదు.


అంతేగాక, వీటన్నిటిని గురించి అన్ని పత్రికల్లో చెప్పాడు, ఇతని పత్రికలలో కొన్ని విషయాలు అర్థంచేసుకోడానికి కష్టతరంగా ఉంటాయి. వీటిని గ్రహించలేని జ్ఞానహీనులు, అస్థిరులు మిగతా లేఖనాలను అపార్ధం చేసుకొన్నట్లే, తమ స్వనాశనానికి వేరొక రీతిగా అపార్ధం చేసుకుంటారు.


ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం, ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి.


వారికి శ్రమ! వారు కయీను త్రోవను అనుసరించారు; లాభం పొందాలని బిలాములా తప్పు మార్గాల్లో పరుగెత్తారు; కోరహులా తిరుగుబాటు చేయడంవలన నాశనం చేయబడ్డారు.


ఆ తరువాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేక అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ