9 అనామకులంగా మేము పని చేస్తున్నా, సుప్రసిద్ధులమే. చచ్చిపోతున్నట్టు ఉన్నాం, అయినా చూడండి, ఇంకా బతికే ఉన్నాం. మేము చేసే దాని వల్ల శిక్ష కలిగినా మరణ శిక్ష పడడం లేదు.
ఎపికూరీయ అనే గుంపువారు మరియు స్తోయికులలో కొందరు జ్ఞానులు పౌలుతో వాదించసాగారు. వారిలో కొందరు, “ఈ వాగుబోతు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు?” అన్నారు. మరికొందరు, “ఇతడు మనకు తెలియని దేవతలను గురించి బోధిస్తున్నాడు” అన్నారు. పౌలు యేసును గురించిన సువార్తను మరియు పునరుత్థానంను గురించి బోధించడం వలన వారు అలా అన్నారు.
అయితే పౌలు అనే ఇతడు ఎఫెసు మరియు ఆసియా ప్రాంతాలన్నింటిలో చాలామంది ప్రజలను ఎలా ఒప్పించి దారి తప్పిస్తున్నాడో మీరు చూస్తున్నారు వింటున్నారు. మానవుల చేతులతో తయారు చేసిన దైవాలు అసలు దైవాలే కావు అని ఇతడు అంటున్నాడు.
అయితే ఇతని గురించి చక్రవర్తికి వ్రాయడానికి ఖచ్చితమైన కారణాలు ఏమి కనబడలేదు. కనుక ఈ విచారణ తర్వాత నేను వ్రాయడానికి నాకు కారణం లభిస్తుందని అతన్ని మీ అందరి ముందుకు, ముఖ్యంగా రాజైన అగ్రిప్ప ముందుకు తీసుకు వచ్చాను.
దేవుడు అపొస్తలులమైన మమ్మల్ని మరణశిక్ష విధించబడినవారి వరుసలో అందరికంటే చివరిగా ఉంచాడని నాకు అనిపిస్తుంది. మేము లోకమంతటికి, దేవదూతలకు అదే విధంగా మనుష్యులకు ఒక వింతగా ఉన్నాము.
అయితే రహస్యమైన సిగ్గుపడాల్సిన పనులను విడిచిపెట్టాము; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని నాశనం చేయం. దానికి విరుద్ధంగా, సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం.
అయితే, ప్రభువుకు భయపడడం అంటే ఏమిటో మాకు తెలుసు, కనుక ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాం. మనమేమైయున్నామో దేవునికి స్పష్టంగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడ స్పష్టంగా తెలుసని నా నిరీక్షణ.