Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 కొరింథీ 6:8 - తెలుగు సమకాలీన అనువాదము

8 గౌరవించబడి అవమానించబడి, చెడు సమాచారం మంచి సమాచారం; నిష్కళంకులమైనా వంచకులుగా ఎంచబడ్డాము;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8-10 ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుం డియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము; దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఘనతలో ఘనహీనతలో అపవాదుల్లో ప్రశంసల్లో మేము పని చేస్తున్నాం. మోసం చేస్తున్నామనే నింద మా మీద ఉంది, అయినా మేము యథార్థవంతులమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 కీర్తి వచ్చినా, అవమానాలు కలిగినా, పొగడ్తలు వచ్చినా, నిందలు కలిగినా, సత్యవంతులన్నా, మోసగాళ్ళన్నా,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 కొరింథీ 6:8
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటి వారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా!


హేరోదీయులతో పాటు తమ అనుచరులను ఆయన దగ్గరకు పంపించారు. వారు ఆయనతో, “బోధకుడా, నీవు యదార్థవంతుడవని, సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కనుక ఇతరులచే నీవు ప్రభావితం కావు.


వారు, “అయ్యా, ఆ మోసగాడు జీవిస్తున్నప్పుడే, ‘మూడు దినాల తర్వాత నేను లేస్తాను’ అని పలికిన మాట మాకు జ్ఞాపకం ఉంది.


వారు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నీవు యదార్థవంతుడవని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కనుక ఇతరులచే నీవు ప్రభావితం కావు; కాని సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?”


ఆ జనసమూహంలో ఆయన గురించి చాలా ఎక్కువగా గుసగుసలు చెప్పుకొంటూ ఉన్నారు. వారిలో కొందరు, “అతడు మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు” అన్నారు.


అందుకు వారు, “కొర్నేలీ అనే శతాధిపతి వద్దనుంచి మేము వచ్చాము. అతడు నీతిమంతుడు మరియు దేవుని భయం గలవాడు, యూదులందరిచే గౌరవించబడుతున్నవాడు. నీవు చెప్పేది వినడానికి నిన్ను ఇంటికి పిలుచుకొని రమ్మని ఒక పరిశుద్ధ దేవదూత అతనితో చెప్పాడు” అన్నారు.


కనుక వారు వీరిని శాంతింప చేయడానికి వచ్చి, చెరసాల నుండి వారిని బయటకు తీసుకువచ్చి, పట్టణం విడిచిపొమ్మని బ్రతిమలాడారు.


“అక్కడ అననీయ అనే ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యూదులందరి చేత మంచి పేరు పొందిన భక్తిపరుడు.


“ఇతడు లోకమంతట యూదులలో కలహాలను రేపుతు ఇబ్బంది కలిగిస్తున్నాడు. నజరేయులు అనే మతశాఖకు ఇతడు నాయకుడు.


కానీ ప్రతిచోట ప్రజలు ఈ మతమార్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు, కనుక దీని గురించి నీ అభిప్రాయం మేము వినాలనుకొంటున్నాం” అన్నారు.


ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కనుక వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు.


ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు.


కనుక సహోదరి సహోదరులారా, ఆత్మతో మరియు జ్ఞానంతో నింపబడిన ఏడుగురిని మీలో నుండి ఏర్పరచుకోండి. మేము ఈ బాధ్యతను వారికి అప్పగిస్తాము.


“మంచి జరుగునట్లు చెడు చేద్దాం” అని కొందరు అపవాదుగా అన్నట్లుగా ఎందుకు అనకూడదు? అలాంటి వారికి తీర్చబడిన తీర్పు న్యాయమైనదే!


అయితే దేవుడు నమ్మదగినవాడైతే, నేను మీకు చేసిన వాగ్దానం “అవునని” చెప్పితే “కాదు” అనేలా ఉండదు.


ఆ విషయంలో మేమెంతో బలహీనులమని నేను సిగ్గుతో ఒప్పుకొంటున్నాను. అయితే ఎవరైనా దేని గురించైనా గొప్పలు చెప్పుకోవడానికి ధైర్యం చేస్తే దాని గురించి నేను కూడా గొప్పలు చెప్పుకోవడానికి ధైర్యం చేస్తాను, నేను అవివేకిగా మాట్లాడుతున్నాను.


కనుక నేను మీకు భారంగా ఉండలేదని మీరు అంగీకరిస్తారు. నేను యుక్తిగలవాడిని కనుక యుక్తిగా మిమ్మల్ని పట్టుకున్నాను.


అయితే రహస్యమైన సిగ్గుపడాల్సిన పనులను విడిచిపెట్టాము; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని నాశనం చేయం. దానికి విరుద్ధంగా, సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం.


సువార్త విషయమై మిమ్మల్ని ప్రాధేయపడడంలో మాకేమీ తప్పుడు ఉద్దేశాలు లేవు లేదా మేము మిమ్మల్ని మోసం చేయడం లేదు.


అతడు సంఘస్థులు కాని వారిలో కూడ మంచి పేరు గలవాడై ఉండాలి, అప్పుడు అతడు నిందలు పాలై సాతాను వలలో చిక్కుకోకుండా ఉంటాడు.


అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.


కనుక మనం కూడా శిబిరం బయట ఉన్న ఆయన దగ్గరకు వెళ్లి ఆయన భరించిన అవమానాన్ని మనం కూడా భరిద్దాం.


క్రీస్తు నామం కొరకు మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే, ఆ మహిమ గల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావం.


దేమేత్రిని గురించి అందరు మంచియే చెప్తున్నారు, సత్యం కూడ సాక్ష్యం ఇస్తుంది. మేము కూడ అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యం సత్యమని నీకు తెలుసు.


యూదులు కాకపోయినా తాము యూదులం అని అబద్ధాలు చెప్పుకొనే సాతాను సమాజానికి చెందిన వారందరిని నీ దగ్గరకు రప్పించి నీ పాదాల ముందు సాగిలపడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వారు ఒప్పుకొనేలా చేస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ