Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 కొరింథీ 6:6 - తెలుగు సమకాలీన అనువాదము

6 పవిత్రతలో, అవగాహనలో, ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 పవిత్రతలో జ్ఞానంలో దీర్ఘశాంతంలో దయలో పరిశుద్ధాత్మలో నిష్కపటమైన ప్రేమలో

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 నిష్కల్మషంగా ఉండటంలో, యితర్లను అర్థం చేసుకోవటంలో, సహనం, దయ చూపటంలో, పరిశుద్ధాత్మ విషయంలో, నిజమైన ప్రేమ వ్యక్తం చేయటంలో,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 పవిత్రతలో జ్ఞానంలో ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 పవిత్రతలో జ్ఞానంలో ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 కొరింథీ 6:6
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. దుష్టమైన దానిని ద్వేషించి మంచిదైన దానిని పట్టుకోవాలి.


కాబట్టి యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు ఉన్న అన్ని ప్రదేశాల్లో క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించాను.


ఒకరికి ఆత్మ ద్వారా జ్ఞాన సందేశం ఇవ్వబడింది, అదే ఆత్మ ద్వారా మరొకరికి విజ్ఞత సందేశం ఇవ్వబడింది.


ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది.


ఎందుకంటే, “ప్రభువు మనస్సును తెలుసుకొని ఆయనకు బోధింపగలవారు ఎవరు?” మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము.


మీ విశ్వాసం మనుష్యల జ్ఞానం మీద కాకుండా దేవుని శక్తి మీదే ఆధారపడాలని, నా మాటలు నా బోధలు జ్ఞానంతో లేక వాక్చాతుర్యంతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నాయి.


నా ప్రాణం తోడు, దేవుని నా సాక్షిగా పిలుస్తాను; మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక నేను తిరిగి కొరింథీకి రాలేదు.


ఎందుకు? మీపై నాకు ప్రేమ లేదా? ఉందని దేవునికి తెలుసు!


ఎవరైన మీ దగ్గరకు వచ్చి మేము ప్రకటించిన యేసును గాక, వేరొక యేసును ప్రకటించినా, లేక మీరు పొందిన ఆత్మకు విరుద్ధమైన వేరొక ఆత్మను మీరు పొందినా, లేక మీరు అంగీకరించింది కాకుండా వేరొక సువార్తను అంగీకరించినా మీరు సుళువుగా సహించేవారేమో.


మాట్లాడడంలో నేను నేర్పులేని వాన్ని కావచ్చు కాని జ్ఞానంలో కాదు. అన్ని విధాలుగా మేము దీన్ని మీకు పూర్తిగా స్పష్టం చేసాము.


కాబట్టి నాకు కలిగినదంత మీ కొరకు చాలా సంతోషంగా ఖర్చుచేస్తాను, నన్ను నేను ఖర్చు చేసుకుంటాను; ఒకవేళ నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తే మీరు నన్ను తక్కువగా ప్రేమిస్తారా?


కాబట్టి, పడద్రోయడానికి కాదు కాని, మిమ్మల్ని కట్టడానికే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని నేను వచ్చినప్పుడు ఉపయోగించుకొని మీ పట్ల నేను కఠినంగా ఉండాల్సిన అవసరం లేకుండా నేను మీ దగ్గర లేనప్పుడు ఇవన్ని మీకు వ్రాస్తున్నాను.


మీరు క్షమించేవాన్ని నేను క్షమిస్తాను. నేను ఏ దోషమైన క్షమిస్తే, మీ కొరకే క్రీస్తు ముందు అలా చేశాను.


ఎంతో దుఃఖపూరిత హృదయంతో, కన్నీటితో మీకు వ్రాసాను. నేను వ్రాసింది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు గాని, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీరు గుర్తించడానికి మాత్రమే.


రాతి పలక మీద గాని, సిరాతో గాని వ్రాయక మానవ హృదయాలు అనే పలకల మీద జీవంగల దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరేనని, మా పరిచర్య ఫలితం మీరేనని మీరు చూపిస్తున్నారు.


“చీకటి నుండి వెలుగు కలుగును గాక” అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింజేసారు.


మీ హృదయంలో మాకు చోటియ్యండి. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని పాడుచేయలేదు, ఎవరినీ మోసగించలేదు


ఈ ఒక్క విషయాన్ని నేను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను: మీరు ధర్మశాస్త్ర క్రియల వల్ల ఆత్మను పొందారా, లేక మీరు వినిన దానిని విశ్వసించడం వల్లనా?


అందుకు నేను మళ్ళీ అడుగుతున్నా, దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చి, మీ మధ్య అద్బుతాలు జరిగిస్తూ ఉన్నది ధర్మశాస్త్ర క్రియల వల్లనా, లేక మీరు విన్న దానిని విశ్వసించడం వల్లనా?


అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం,


మీరు దానిని చదివినట్లైతే ఆ క్రీస్తు మర్మాన్ని గురించి నాకున్న పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోగలరు.


ప్రేమలో ఒకరిని ఒకరు సహించుకుంటూ పూర్ణ వినయంతో సాత్వికంతో, దీర్ఝశాంతంతో ఉండండి.


క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరి పట్ల ఒకరు దయ కనికరాన్ని కలిగి ఉండండి.


యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియచేయబడింది.


బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడివున్నాయి.


కనుక, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు, ప్రియమైన వారిలా, మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.


విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి.


నీవు యవ్వనస్థుడవని ఎవరు నిన్ను చులకన చేయకుండా ఉండడానికి నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నడుచుకో.


సంపూర్ణమైన పవిత్రతతో నీ కన్నా పెద్దవారైన స్త్రీలను తల్లులుగా, నీ కన్నా చిన్నవారైన స్త్రీలను చెల్లెళ్ళుగా చూడు.


అయితే, నా బోధల గురించి, నా జీవిత విధానం, నా ఉద్దేశాలు, విశ్వాసం, ఓర్పు, ప్రేమ, దీర్ఘశాంతం,


వాక్యాన్ని ఆతురతతో అనువైన సమయంలో అనువుకాని సమయంలో ప్రతి సమయంలో సిద్ధపాటు కలిగి, ఎంతో సహనంతో, సరియైన సూచనలతో ప్రజలను సరిదిద్దుతూ, గద్దిస్తూ, ప్రోత్సాహిస్తూ బోధించు.


నీవు ప్రతివిషయంలో వారికి మాదిరిగా జీవిస్తూ, ఏది మంచిదో అదే చేస్తూ, నీ బోధలలో నిజాయితీని, గంభీరతను చూపిస్తూ,


పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛముగా ఉంటుంది, తరువాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది.


పరలోకం నుండి పంపబడి పరిశుద్ధాత్మచే ప్రభావితులై మీకు సువార్తను ప్రకటించినవారి ద్వారా మీకు ఇప్పుడు చెప్పబడిన సంగతులను వారు చెప్పినప్పుడు, తమ కొరకు కాదు కాని మీ కొరకే తాము పరిచర్య చేసారనే సంగతి వారికి వెల్లడి చేయబడింది. వీటిని దేవదూతలు సహితం చూడాలని ఆశించారు.


ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు, తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగివుండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా అధికంగా ప్రేమించుకోండి.


ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ