Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 కొరింథీ 5:9 - తెలుగు సమకాలీన అనువాదము

9 కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నా లేక దానికి దూరంగా ఉన్నా, ఆయనను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉందాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 అందువల్ల మనమీ శరీరంలో నివసిస్తున్నా లేక దానికి దూరంగా ఉన్నా ఆయన్ని ఆనంద పరచటమే మన ఉద్దేశ్యం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నా లేదా దానికి దూరంగా ఉన్నా ఆయనను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉందాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నా లేదా దానికి దూరంగా ఉన్నా ఆయనను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉందాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 కొరింథీ 5:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు.


కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను.


కాబట్టి ఇలా క్రీస్తుకు సేవ చేసేవారు దేవుని సంతోషపరుస్తారు, మానవుల అంగీకారాన్ని పొందుతారు.


మనం జీవిస్తే అది ప్రభువు కొరకే జీవిస్తాము, మరణిస్తే అది ప్రభువు కొరకే మరణిస్తాం, కనుక మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారం అవుతాము.


మరొకరు వేసిన పునాది మీద నేను కట్టకుండేలా, క్రీస్తు తెలియని చోట్ల సువార్త ప్రకటించాలనేది ఎల్లప్పుడు నా ఆశగా ఉండింది.


కనుక నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ నిష్ప్రయోజనం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాలలో పూర్తి శ్రద్ధ చూపండి.


కాబట్టి మనం ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ఈ దేహంలో నివసించేంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు.


కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సంపూర్ణ నమ్మకం కలిగి ఈ శరీరానికి దూరంగా ఉండి, ప్రభువుతో ఆయన ఇంట్లో ఉండాలని ఎంతగానో ఇష్టపడుతున్నాము.


తాను ప్రేమించిన వానిలో, ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన తన మహాకృపకు ఘనత కలుగునట్లు దేవుడు ఈ విధంగా చేశారు.


ప్రతి మంచి పనిలో సఫలమవుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించాలని,


నాలో బలంగా పని చేస్తున్న క్రీస్తు శక్తి అంతటిని బట్టి, ఇప్పటి వరకు నేను ప్రయాసపడి పనిచేస్తున్నాను.


సహోదరీ సహోదరులారా, చివరిగా, దేవునికి ఇష్టులుగా ఎలా జీవించాలో మేము మీకు బోధించిన ప్రకారం మీరు కూడా అలాగే జీవిస్తున్నారు. మీరు ఇలాగే ఇక ముందు కూడా జీవించాలని ప్రభువైన యేసులో మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము.


ఆ ప్రేమ ద్వారా సమాధానకరమైన జీవితాన్ని గడపడమే మీ ధ్యేయంగా పెట్టుకొని, మేము మీకు చెప్పిన విధంగా ఇతరుల జోలికి పోకుండా మీ సొంత విషయాలనే చూసుకుంటూ మీ చేతులతో కష్టపడి పని చేయండని మిమ్మల్ని వేడుకొంటున్నాము.


అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.


మనం కదల్చబడని రాజ్యాన్ని పొందుకొంటున్నాం గనుక, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం,


కనుక, వారి అవిధేయత మాదిరిని అనుసరించి ఎవరూ నశించిపోకుండా ప్రతి ప్రయత్నాన్ని చేసి దేవుని విశ్రాంతిలో ప్రవేశిద్దాం.


కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు దీని కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు కనుక కళంకం లేనివారిగా నిందలేనివారిగా ఆయనలో శాంతం గలవారిగా ఉండడానికి ప్రయత్నించండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ