Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 కొరింథీ 5:21 - తెలుగు సమకాలీన అనువాదము

21 మనం ఆయనలో దేవుని నీతిగా అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 క్రీస్తు పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 కొరింథీ 5:21
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. కనుక పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.


మీరు పరిశుద్ధుడు, నీతిమంతుడైన వానిని తిరస్కరించి నరహంతుకుడిని మీ కొరకు విడుదల చేయమని అడిగారు.


“నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు” అని వ్రాయబడివున్న ప్రకారం, విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా సువార్తలో దేవుని నీతి వెల్లడి చేయబడింది.


యేసు క్రీస్తు మన పాపాల కొరకు మరణానికి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మరణం నుండి సజీవంగా తిరిగి లేచారు.


ఒక్క మానవుని అవిధేయత వలన అనేకమంది పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒక్క మానవుని విధేయత వల్లనే అనేకమంది నీతిమంతులుగా చేయబడ్డారు.


దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.


అందుకే, ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతది గతించిపోయింది, క్రొత్తది ఇక్కడ ఉంది!


ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపం నుండి మనలను విమోచించడానికి క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడయ్యారు. ఎందుకంటే, లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం “మ్రానుపై వ్రేలాడదీయబడిన ప్రతీ ఒక్కరు శాపగ్రస్తులే.”


క్రీస్తు మనల్ని ప్రేమించి, పరిమళ సువాసనగా మనకొరకు తనను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొన్నట్లే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి.


క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్ని బట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని,


అయితే మన ప్రధాన యాజకుడు మనలానే అన్ని విధాలుగా శోధించబడినప్పటికి ఆయన పాపం చేయలేదు కనుక మన బలహీనతల గురించి సానుభూతి చూపించేవాడు.


పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చించబడినవాడై వుండి మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు.


ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకొనిరావడానికి, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు.


పాపాలను తొలగించడానికే క్రీస్తు ప్రత్యక్షమయ్యారని మీకు తెలుసు. ఆయనలో ఎలాంటి పాపం లేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ