Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 కొరింథీ 5:15 - తెలుగు సమకాలీన అనువాదము

15 ఆయన అందరి కొరకు చనిపోయారు, జీవిస్తున్నవారు ఇకపై తమ కొరకు కాక, వారి కొరకు మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 బతికే వారు ఇక నుంచి తమ కోసం బతకకుండా తమ కోసం చనిపోయి సజీవంగా తిరిగి లేచిన వాడి కోసమే బతకాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 ఆయన అందరి కోసం మరణించాడు. కనుక జీవిస్తున్నవాళ్ళు యిక మీదట తమ కోసం జీవించరాదు. మరణించి ప్రజలకోసం మళ్ళీ బ్రతికింపబడినవాని కోసం జీవించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 ఆయన అందరి కోసం చనిపోయారు, కాబట్టి జీవిస్తున్నవారు ఇకపై తమ కోసం కాక, వారి కోసం మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 ఆయన అందరి కోసం చనిపోయారు, కాబట్టి జీవిస్తున్నవారు ఇకపై తమ కోసం కాక, వారి కోసం మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 కొరింథీ 5:15
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

మనం భయపడకుండా ఆయనను సేవించాలని, మన శత్రువుల చేతి నుండి మనలను తప్పించి,


“నా మాటలను విని నన్ను పంపినవానిని నమ్మువాడు, నిత్యజీవం గలవాడు మరియు అతడు మరణం నుండి జీవంలోనికి దాటాడు కనుక అతనికి తీర్పు ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


సజీవుడైన తండ్రి నన్ను పంపినందుకు, నేను తండ్రి వలననే జీవిస్తున్నాను, కనుక నన్ను తినేవారు నా వలన జీవిస్తారు.


కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన.


యేసు క్రీస్తు మన పాపాల కొరకు మరణానికి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మరణం నుండి సజీవంగా తిరిగి లేచారు.


ఎన్నడు అలా చెప్పకూడదు, పాపాన్ని బట్టి మరణించిన మనం దానిలో ఎలా జీవించి ఉండగలం?


మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించునట్లు, మన పాత స్వభావం ఆయనతోపాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు.


క్రీస్తు మీలో ఉన్నట్లైతే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది.


ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని అనుగ్రహించే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది.


శరీరంచే పాలించబడే మనస్సు మరణము, కాని ఆత్మచే పాలించబడే మనస్సు జీవం మరియు సమాధానమై ఉన్నది.


అలాగే నేను కూడా ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నా స్వలాభాన్ని ఆశించకుండా, అనేకమంది రక్షింపబడాలని వారి మంచి కోరుతున్నాను.


అందుకే, క్రీస్తు కొరకు, నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. ఎందుకంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.


వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది గాని ఆత్మ జీవం ఇస్తాడు.


అందువల్ల, మేము ఇప్పటి నుండి ఎవరిని లోకసంబంధమైన దృష్టితో లక్ష్యపెట్టము. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే లక్ష్యపెట్టినా, ఇక మేము అలా చేయం.


మనం ఆత్మ వలన జీవిస్తున్నాము కనుక మనం ఆత్మతో పాటు నడుద్దాము.


కాబట్టి మీరు, ఇక మీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.


అందుకే వాక్యంలో, “నిద్రిస్తున్నవాడా, మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు,” అని వ్రాయబడింది.


ఏ విధంగా అంటే, బాప్తిస్మంలో మీరు ఆయనతోపాటు పాతిపెట్టబడి, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని క్రియలను మీరు విశ్వసించుట ద్వారా ఆయనతోపాటు మీరు కూడా మృతులలో నుండి లేచారు.


మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కనుక, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చునివున్నారు.


మీరు మాటలలో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.


మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కొరకు కాకుండా ప్రభువు కొరకు చేస్తున్నామని మనస్ఫూర్తిగా చేయండి.


ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం లోకంలో జీవించి ఉన్నా లేదా మరణించినా ఆయనతోపాటు మనం జీవించాలని క్రీస్తు మనకొరకు చనిపోయారు.


యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు.


అందుకే మృతులకు కూడ సువార్త ప్రకటించబడింది. అందరిలాగా వారు ఐహిక జీవితంలో వారు తీర్పు పొందారు. కాని వారి ఆత్మీయ జీవితంలో వారు దేవునిలా జీవించాలని వారికి బోధింపబడింది.


దేవుడు మన మధ్య తన ప్రేమను ఈ విధంగా చూపించారు: ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు.


జీవించు వాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడు, ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా అధికారంలోనే ఉన్నాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ