Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 కొరింథీ 1:1 - తెలుగు సమకాలీన అనువాదము

1 పౌలు, దేవుని చిత్తం బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడు మన సోదరుడు తిమోతి, కొరింథీలోని దేవుని సంఘానికి, అకయ ప్రాంతమంతటిలోని దేవుని పరిశుద్ధులందరికి కలిపి వ్రాయునది:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దేవుని చిత్తమువలన క్రీస్తు యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో నున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 కొరింతులోని దేవుని సంఘానికీ అకయ ప్రాంతమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న విషయాలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 దైవేచ్ఛ వల్ల యేసు క్రీస్తు అపొస్తులునిగా ఉన్న పౌలు నుండి, మన సోదరుడైన తిమోతి నుండి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతంలోని పవిత్రులకు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సోదరుడు తిమోతి, కొరింథీలోని దేవుని సంఘానికి, అకాయ ప్రాంతమంతటిలోని దేవుని పరిశుద్ధులందరికి కలిపి వ్రాయునది:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సోదరుడు తిమోతి, కొరింథీలోని దేవుని సంఘానికి, అకాయ ప్రాంతమంతటిలోని దేవుని పరిశుద్ధులందరికి కలిపి వ్రాయునది:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 కొరింథీ 1:1
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

పౌలు దెర్బేకు వచ్చి అక్కడి నుండి లుస్త్రకు వచ్చాడు, అక్కడ తిమోతి అనే పేరుగల విశ్వాసిని కలుసుకున్నాడు. అతని తల్లి క్రీస్తును విశ్వాసించిన యూదురాలు మరియు తండ్రి గ్రీసు దేశస్థుడు.


యెరూషలేములో ఉన్న ప్రభువు యొక్క ప్రజల మధ్యలో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి మాసిదోనియా అకయ వారు కొంత విరాళాన్ని ఇవ్వడానికి సంతోషించారు.


నా సహపనివాడైన తిమోతి అలాగే నాతోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.


అలాగే వారి ఇంట్లో కూడుకునే సంఘానికి కూడా వందనాలు తెలియజేయండి. ఆసియా ప్రాంతంలో మొదటిగా క్రీస్తును అంగీకరించిన నా స్నేహితుడైన ఎపైనెటుకు వందనాలు తెలియజేయండి.


యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, దేవుని సంఘమైనా మరి ఎవరైనా సరే తప్పిపోవడానికి కారణం కాకండి.


తిమోతి వచ్చినప్పుడు, అతడు మీతో నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.


స్తెఫను అతని ఇంటి వారు అకయలో మొదటిగా క్రీస్తును స్వీకరించారని మీకు తెలుసు. వారు దేవుని ప్రజల సేవకు తమను తాము అర్పించుకున్నారు. సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను,


క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్.


మీరు విమోచింపబడక ముందు మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మలో మీరు కడుగబడి పవిత్ర పరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డారు.


ఎందుకంటే, సిల్వాను ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధించబడిన, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అవునని చెప్పి, కాదనేవాడు కాడు. అవుననే వాడు.


నా ప్రాణం తోడు, దేవుని నా సాక్షిగా పిలుస్తాను; మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక నేను తిరిగి కొరింథీకి రాలేదు.


నాలో క్రీస్తు సత్యం ఉన్నందుకు, అకయ ప్రాంతాల్లో నేనిలా గర్వపడకుండ ఎవరు ఆపలేరు.


సహాయం చేయడానికి మీరు ఆసక్తి గలవారని నాకు తెలుసు, అందుకే మాసిదోనియాలోని ప్రజలకు మీ గురించి గొప్పగా, అకయలో ఉన్న మీరు గత ఏడాది నుండి సహాయం చేయడానికి సిద్ధపడ్డారని వారికి చెప్పాను; మీ ఆసక్తి వారిలో అనేకమందిని ప్రేరేపించింది.


పౌలు, అనే నేను మనుష్యుల నుండి గాని లేక ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను.


కనుక మీరందరు యేసుక్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై యున్నారు.


దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, ఎఫెసులో ఉన్న క్రీస్తు యేసునందు నమ్మకస్థులైన, దేవుని పరిశుద్ధ ప్రజలకు వ్రాయునది:


క్రీస్తు యేసు సేవకులైన పౌలు మరియు తిమోతి, క్రీస్తు యేసునందు ఫిలిప్పీలో ఉన్న దేవుని పవిత్ర ప్రజలకు, సంఘ పరిచారకులకు, సంఘ పెద్దలకు శుభమని చెప్పి వ్రాయునది:


తండ్రియైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి, పౌలు, సిల్వాను, తిమోతి అనే మేము వ్రాయునది: మీకు కృపా సమాధానములు కలుగును గాక.


మా సహోదరుడు దేవుని పరిచర్యయైన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడంలో మా తోటిపనివాడైన తిమోతిని, మీ విశ్వాసంలో మిమ్మల్ని ప్రోత్సహించి బలపరచడానికి పంపించాము,


తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి, పౌలు, సిల్వాను, తిమోతి అనే మేము వ్రాయునది:


మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,


క్రీస్తుయేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానాన్ని అనుసరించి దేవుని చిత్తప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు అనే నేను,


దేవుడు ఎన్నుకొన్నవారి విశ్వాసాన్ని, నిత్యజీవం గురించిన నిరీక్షణలో ఉండే దైవభక్తిలోనికి నడిపించే, వారి సత్యజ్ఞానాన్ని బలపరచడానికి,


క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి, మన ప్రియ స్నేహితుడు, తోటిపనివాడైన ఫిలేమోనుకు,


మన సహోదరుడైన తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యాడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అతడు త్వరగా వస్తే, నేను మిమ్మల్ని చూడడానికి అతనితో కలిసి వస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ