Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 తిమోతికి 5:6 - తెలుగు సమకాలీన అనువాదము

6 తన సొంతసుఖాల కొరకు జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 కాని భోగాలకొరకు జీవించే వితంతువు జీవిస్తున్నా మరణించినట్లే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 తన సొంతసుఖాల కోసం జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 తన సొంతసుఖాల కోసం జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 తిమోతికి 5:6
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకొంటారు నీవైతే నన్ను వెంబడించు” అన్నారు.


నాతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీ కొరకు సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు.


“కొన్ని రోజుల్లోనే, ఆ చిన్న కొడుకు తన దగ్గర ఉన్నదంతా పోగుచేసుకొని, సుదూర దేశానికి బయలుదేరాడు మరియు అక్కడ తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తన సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేసాడు.


ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.


కాని ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, అతడు తప్పిపోయి దొరికాడు కాబట్టి మనం సంతోషించి ఆనందించాలి’ అని చెప్పాడు.”


“ఊదారంగు సన్నని నార బట్టలను ధరించుకొని, ప్రతిరోజూ విలాసంగా జీవించే ఒక ధనవంతుడు ఉండేవాడు.


అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించి విలాసవంతంగా జీవించేవారు రాజభవనాల్లో ఉంటారు.


మీరైతే, మీ అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారిగా ఉండి,


మనం మన అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనలను బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.


అందుకే వాక్యంలో, “నిద్రిస్తున్నవాడా, మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు,” అని వ్రాయబడింది.


మీ పాపాలను బట్టి మీ శరీరం సున్నతి పొందని కారణంగా మీరు చనిపోయినప్పుడు, దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో పాటు జీవింపచేశారు. ఆయన మన పాపాలన్నిటిని క్షమించారు,


అలాంటివారు, పాపంతో నిండిన అన్ని రకాల దురాశలకు బానిసలైన మోసపూరిత స్త్రీల ఇళ్లలో చొరబడి వారిని లోబరుచుకుంటారు.


మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహరించు రోజున మీ హృదయాలను మరియు మిమ్మల్ని మీరు పోషించుకున్నారు.


ఆమె తనకు తాను ఎంతగా హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో, అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి. ఎందుకంటే, ఆమె తన హృదయంలో ఇలా అనుకొంది, ‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను. నేను విధవరాలిని కాను, ఇక ఎన్నడు సంతాపం అనుభవించనని.’


“సార్దీసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: దేవుని ఏడు ఆత్మలు, ఏడు నక్షత్రాలు గలవాడు ఈ మాటలు చెప్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నీవు బ్రతికున్నావని పేరు ఉంది కాని నీవు చచ్చిన దానివే.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ