Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 తిమోతికి 4:10 - తెలుగు సమకాలీన అనువాదము

10 అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 మనుషులందరికీ మరి విశేషంగా విశ్వాసులకు ముక్తిప్రదాత అయిన సజీవ దేవుని మీదే మనం నిరీక్షణ పెట్టుకున్నాము. కాబట్టి చెమటోడ్చి పాటుపడుతున్నాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మినవాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పని చేస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 తిమోతికి 4:10
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు.


వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు.


మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల!


వారు ఆ స్త్రీతో, “నీవు చెప్పిన దానిని బట్టి కాదు; కాని మాకు మేమే విని నిజంగా ఈయన లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం” అన్నారు.


“నా మాటలను విని నన్ను పంపినవానిని నమ్మువాడు, నిత్యజీవం గలవాడు మరియు అతడు మరణం నుండి జీవంలోనికి దాటాడు కనుక అతనికి తీర్పు ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.


అయితే నేనేమైవున్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో నిష్ఫలం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటె నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, అది నాకు తోడుగా వున్న దేవుని కృపయే.


మరణకరమైన భయంకర ప్రమాదాల నుండి ఆయన మమ్మల్ని ఎప్పుడు కాపాడుతున్నాడు. ఇక ముందు కూడ కాపాడతాడు. ఆయన తిరిగి మమ్మల్ని కాపాడతాడని ఆయనలో నిరీక్షణ కలిగివున్నాము.


ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి.


ప్రజలందరు సత్యాన్ని తెలుసుకొని రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.


ఆయనే ప్రజలందరి రక్షణ కొరకు విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకున్నారు. దీని గురించి సరియైన సమయంలో సాక్ష్యం ఇవ్వబడుతుంది.


త్వరలో నీ దగ్గరకు రావాలని ఆశిస్తున్నాను, ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా కాని సత్యానికి పునాదిగా స్తంభంగా వున్న జీవంగల దేవుని సంఘమైన దేవుని గృహంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలనే నేను ఈ సూచనలు వ్రాస్తున్నాను.


ఈ లోకంలో ధనవంతులైన వారిని గర్వంతో ఉండవద్దని, స్థిరంగా ఉండని సంపదలపై తమ నమ్మకాన్ని ఉంచకుండా, వారి సంతోషం కొరకు కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా అనుగ్రహించు దేవునిలోనే నిరీక్షణ ఉంచమని ఆజ్ఞాపించు.


క్రీస్తు కొరకైన అవమానాన్ని ఐగుప్తు ధనం కన్నా గొప్ప విలువైనదిగా భావించాడు, ఎందుకంటే అతడు తన బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు.


కనుక మనం కూడా శిబిరం బయట ఉన్న ఆయన దగ్గరకు వెళ్లి ఆయన భరించిన అవమానాన్ని మనం కూడా భరిద్దాం.


మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.


ఆయనే మన పాపాలకు ప్రాయశ్చిత్త బలి, మనకొరకు మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కొరకు కూడా.


మరియు లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం చూశాము సాక్ష్యమిచ్చాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ